టీడీపీ తో పొత్తు పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతుందా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలంగా పొత్తులపై క్లారిటీ ఇస్తున్న ఏపీ ప్రజలలో చిన్నపాటి సందేహం ఉండేది. ఎందుకంటే... పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి కొంతకాలం అవుతున్నా సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే తీసుకున్న ఏ స్టాండ్ పై అయినా సాలిడ్ గా నిలబడడం లేదు. పవన్ పై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి నిజం చేసి చూపించాడు. మొన్న విశాఖలో జరిగిన సంఘటన కారణంగా నియంత్రణ కోల్పోయిన పవన్ కళ్యాణ్ అసభ్యంగా మాట్లాడడం ఏంటో మంది జనసేన కార్యకర్తలను మరియు ప్రజలను పునరాలోచించేలా చేసిందని చెప్పాలి.

ఇప్పటి వరకు కూడా పవన్ ను అభిమానించి ఇష్టపడిన విషయాలలో ఒకటి "ఇతరులు తనను దూషించినా నెమ్మదిగా మాట్లాడడం... వారిలా పదజాలం ఉపయోగించకపోవడమే". కానీ మొన్న అది కాస్తా "కొడకల్లారా" అంటూ పలుమార్లు సంబోధిస్తూ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ద్వేషించే జనసైనికులు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక మరో విషయం టీడీపీ తో పొత్తు గురించి డైరెక్ట్ గా చెప్పకపోయినా.. విజయవాడలో పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది. పైగా బీజేపీ తో పొత్తు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు పవన్. అలా చెప్పకనే మళ్ళీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటాడని సూచనలు ఇస్తున్నాడు.

ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక జనసైనికులు మదిలో కూడా కొత్త ఆలోచనలు మొదలు అవుతున్నట్లే ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ గురించి కూడా వ్యతిరేక కామెంట్స్  చేసిన పవన్ మళ్ళీ అదే గూటికి చేరుతున్నాడు అన్న విషయం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా జనసేనకు మైనస్ అయ్యే ప్రమాదం ఉందట. మరి చుడ్తాల్ ఏమి జరగనుందో ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: