ఈసారైనా పవన్ అభిమానులు జనసేనకు ఓట్లేస్తారా ?
అయితే ఇదే జనం పవన్ ను ఏపీ సీఎం చేయడానికి మాత్రం ఎందుకో వెనక్కు తగ్గుతున్నారు. మీటింగ్ లలో అరుపులు, కేకలు గగ్గోలు పెడుతూ సీఎం సీఎం సీఎం అంటారు. కానీ తీరా ఎన్నికల సమయం రాగానే బ్యాలెట్ బాక్స్ లలో మాత్రం ఓట్లు వేయడానికి మనసు రావడం లేదు. మరి అలాంటి అభిమానం ప్రేమ ఇందుకోసం అంటూ పవన్ బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు సాదించలేకపోయాడు. అందుకే ఈ సారి మరింత పటిష్టంగా మరియు ప్రణాళికతో ఎన్నికలకు వెళ్ళడానికి పవన్ సిద్ధమవుతున్నారు. ఆయన చేయాల్సింది చేస్తున్నారు.
ఇక ఎన్నికల సమయంలో చేయాల్సింది అంతా జనసైనికులుగా చెప్పుకుంటున్న పవన్ అభిమానులు మాత్రమే. ఇదే అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి పవన్ ను గెలిపిస్తారు చూడాలి. టీడీపీ మరియు జనసేనలు కనుక కలిసి పోటీ చేస్తే పవన్ సీఎం అవుతారని అంతా అనుకుంటున్నారు. మరోవైపు బీజేపీ తో కలిసి పోటీ చేస్తారని అంటున్నారు. ఎలా ఎన్ని ఊహాగానాలు బయట ఉన్నా వాస్తవం అన్నది బయటకు వచ్చే వరకు క్లారిటీ రాదు.