అమరావతి : జనసేన పరిస్ధితి ఇంత ఘోరంగా ఉందా ?

Vijaya






తెలుగుదేశంపార్టీ వర్గాలు ఈమధ్య సర్వే పేరుతో ఒక రిజల్టును జనాలపైకి వదిలారు. అదేమిటంటే ’ఆత్మసాక్షి’ అనేసంస్ధ ఏపీలో పార్టీల బలాబలాలపై ఒక సర్వే నిర్వహించిందట. అందులో టీడీపీ 44.5 శాతం ఓట్లతో 95 సీట్లు గెలుచుకుంటుందని వచ్చిందట. ఇక అధికార వైసీపీ 43 శాతం ఓట్లతో 75 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంటుందట. ఫైనల్ గా జనసేన 9 శాతం ఓట్ల షేరుతో 5 సీట్లతో సరిపెట్టుకుంటుందని తేలిందట.






ఈ సర్వేని మామూలు జనాలు నమ్మటం కాదు అసలు టీడీపీ నేతలే నమ్మటంలేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో టీడీపీ పరిస్ధితి చాలా ఘోరంగాఉందని స్వయంగా చంద్రబాబునాయుడే నేతలపై మండిపడుతున్నారు. నేతల్లో చాలామంది పార్టీ పిలుపుకు ఏమాత్రం స్పందించటంలేదని ఇలాగైతే 2024 ఎన్నికల్లో మళ్ళీ అందరం ఇంట్లోనే కూర్చోవాలని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని చంద్రబాబే చెప్పారు.





అంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని టీడీపీకే నమ్మకం లేకపోతే ఇక జనాలు మాత్రం ఆ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు ? ఇందుకనే ఈ సర్వే బోగస్ అనిపిస్తోంది. అయితే విచిత్రం ఏమిటంటే తమ సర్వేలో జనసేనకు మరీ చీపుగా 5 సీట్లు మాత్రమే వస్తాయని ఆత్మసాక్షి తేల్చటం. ఈ  బోగస్ సర్వేని టీడీపీ వంటకం చేసి జనాల్లోకి వదిలేసిందని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అనుమానం వ్యక్తంచేశారు.





ఇలాంటి పిచ్చి సర్వేల పేరుతో తమపై టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందని మండిపడ్డారు. టీడీపీ వేవ్ దిశగా ఏపీ వెళుతోందని ఆత్మసాక్షి సర్వేలో తేలిందని చెప్పటాన్ని బొలిశెట్టి ఎద్దేవా చేశారు. 2022 ఎన్నికల సమయంలో తమ అంచనాలు ఘోరంగా తప్పాయని చెప్పి చెంపలేసుకుని దుకాణాన్ని మూసేసిన ఆత్మసాక్షి పేరుతో చేయించిన సర్వే కేవలం టీడీపీని బతికించుకోవటానికి తప్ప ఇంకేమీ కాదని బొలిశెట్టి తేల్చేశారు. 2024లో వచ్చేది జనసేన ప్రభంజనమే అని బొలిశెట్టి చెప్పింది కూడా ఆత్మసాక్షి సర్వేలాగే ఉందేమో అని చిన్న అనుమానం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: