అమరావతి : టీడీపీలో ఫ్రస్ట్రేషన్ కు ఇదే కారణమా ?

Vijaya






తెలుగుదేశంపార్టీలో బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న అనుమానాలు బాగా పెరిగిపోతున్నట్లుంది. జాతీయ మీడియా సంస్ధలు చెబుతున్న సర్వే రిపోర్టులతో చంద్రబాబునాయుడు అండ్ కోకి దిక్కుతోస్తున్నట్లు లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని చంద్రబాబు, ఎల్లోమీడియా పదేపదే చెబుతున్నాయి.




ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే వైసీపీకి 20 ఎంపీ స్ధానాలు ఖాయమని జాతీయమీడియా చేసిన సర్వేల్లో బయటపడింది.  దాంతో చంద్రబాబులో అసహనం బాగా పెరిగిపోతున్నట్లుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిగిలిన రాష్ట్రాల్లో ప్రతిపక్షాల వ్యవహారం వేరుగా ఉంటే ఏపీలో టీడీపీ వ్యవహారం వేరుగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు  ఐదేళ్ళు వెయిట్ చేస్తాయి. ఈలోగా అధికారపార్టీ నుండి తప్పులు జరిగితే ఎండగడతాయి.



కానీ ఏపీలో మాత్రం ఎల్లపుడూ తాను మాత్రమే అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటారు. పొరబాటున ప్రతిపక్షంలో కూర్చోవాల్సొస్తే ఎంతమాత్రం తట్టుకోలేరు. బాధ్యతలు తీసుకున్నదగ్గర నుండి అధికారపార్టీని గబ్బుపట్టించేపనిలోనే 24 గంటలూ నిమగ్నమయ్యుంటారు. ఈయనకు బలమైన మీడియా వందశాతం మద్దతుగా నిలుస్తుంది. ఇపుడు రాష్ట్రంలో జరుగుతున్నదిదే. మొన్నటి ఎన్నికల్లో జనాలు టీడీపీని అంత ఘోరంగా ఓడించటాన్ని చంద్రబాబు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు. తమను లేవకొండ దెబ్బకొట్టడాన్న మంటను జగన్మోహన్ రెడ్డి మీద చూపుతున్నారు.



ఇందులో భాగంగానే తప్పుడు ఆరోపణలు, మార్ఫుడు ఫొటోలతో టీడీపీ రెచ్చిపోతోంది. తాజాగా మాధవ్ అసభ్య వీడియో విషయంలో అమెరికా ఫోరెన్సిక ల్యాబ్ నివేదిక పేరుతో ఒక ఫేక్ సర్టిఫికేట్ సర్క్యులేట్ చేసింది. అలాగే మంత్రి విడదలరజని తొందరలోనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతోందంటు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అందుకు బాలకృష్ణకి మంత్రి బొకే ఇస్తున్నట్లు ఫొటోషాప్ ద్వారా మార్ఫించేసిన ఫోటును వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తు జనాల మద్దతును కూడగట్టకుండా ఫేక్ ప్రచారానికి, తప్పుడు ప్రకటనలనే నమ్ముకునే స్ధాయికి దిగజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: