స్నేహితుడి ఎంగేజ్మెంట్.. ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ తో అందరు షాక్?
స్నేహితులు ఎవరైనా ఇలాంటివి చేశారు అంటే చాలు ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. వధూవరులను ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని రకాల బహుమతులు తీసుకువచ్చి ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇక స్నేహితులు ఇచ్చే బహుమతులు చూసి బంధుమిత్రులు సైతం షాక్ అవుతూ వుంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో యువకుడి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకలో వరుడి తరపు స్నేహితులు అతనికి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. స్నేహితులు ఇచ్చిన బహుమతి చూసి వరుడు షాకయ్యాడు. అక్కడ ఉన్న బంధువులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన లక్కిరెడ్డి ప్రసాద్ చెయ్యేరు గ్రామానికి చెందిన రమ్య తో పెళ్లి కుదిరింది. వారికి ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే పెళ్ళికొడుకు స్నేహితులు స్టేజ్ మీద ఫోటోలు దిగుతున్న వధూవరులకు మైండ్ బ్లాక్ అయ్యే బహుమతి ఇచ్చారు. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. ఒకప్పుడు సెల్ఫోన్ లు అందరికీ అందుబాటులోకి రాకముందు అందరూ ఉపయోగించిన కాయిన్ బాక్స్ డబ్బా ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది ఇచ్చి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే సెల్ ఫోను రాకముందు అందరూ ఈ కాయిన్ బాక్స్ వద్దకు వెళ్లి ఫోన్స్ చేసుకునేవారు అన్న విషయం తెలిసిందే. ఇది చూసి బంధువులందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.