రాయలసీమ : టీడీపీకే రివర్సు కొడుతోందా ?

Vijaya

నిజంగా హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియోగురించి మాట్లాడుకోవాలంటే చికాకుగా ఉంది. ఒరిజినలో మార్ఫుడో చెప్పలేంకానీ సర్క్యులేషన్లో ఉన్న  మాధవ్ బూతివీడియోను ఎవరు సమర్ధించరు. ఇదే సమయంలో ఆ వీడియో నిజమే అయినా అదిపూర్తిగా మాధవ్ వ్యక్తిగతానికి సంబంధించినదని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు, ఎవరితో ఎంపీ అలా ప్రవర్తించినా సమాజానికి వచ్చిన నష్టమేమీలేదు. కాకపోతే సదరు వీడియో లీకవ్వటంతోనే ఇపుడు కంపైంది.వీడియోను లీక్ చేయటమే అసహ్యమనుకుంటే దాన్ని టీడీపీ నేతలు పట్టుకుని ప్రతిరోజు నానా యాగీ చేస్తుండటం మరింత అసహ్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి చంద్రబాబునాయుడు అండ్ కో కు ఇంతకుమించిన అంశమే దొరకలేదా ? అని ఆశ్చర్యంగా ఉంది. ఈ బూతు వీడియో గురించి ఎంత యాగీ చేస్తుంటే టీడీపీకి అంత మైనస్ అవుతోందని అనంతపురం జిల్లా సమాచారం. ఇపుడు అసలు విషయం మరుగునపడిపోయి కొసరు విషయం కులాల కుమ్ములాగ తెరపైకి వచ్చేసింది.జిల్లాలో ఇపుడు కమ్మ-కురబ సామాజికవర్గాల ఆధిపత్య గొడవలుగా మారిపోయింది. నిజానికి జిల్లాలో కమ్మోరున్నదే సుమారు 4 శాతం. కానీ దశాబ్దాలుగా ఆధిపత్యం మాత్రం వాళ్ళదే. ఇపుడు కూడా రాప్తాడు, ధర్మవరం, ఉరవకొండ, అనంతపురం, హిందుపురం, కల్యాణదుర్గం, కదిరి నియోజకవర్గాల్లో వాళ్ళదే ఆధిపత్యం. ఇదే సమయంలో కురబలు జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. నిజానికి కురబ సామాజికవర్గం జనాభా ముందు కమ్మోరి జనాభా చాలా చాలా తక్కువనే చెప్పాలి.ఎంపీ అసభ్యవీడియోని ఎవరు లీక్ చేశారు ? ఎలా లీక్ చేశారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎంపీకి మరో మహిళకు మధ్య జరిగిన వ్యవహారాన్ని టీడీపీ నేతలే లేకపోతే ముఖ్యమంత్రి ప్రత్యర్ధులో ఎలాగో దొరికించుకుని జగన్ను ఇబ్బందిపెట్టడటమే టార్గెట్ గా వీడియోను లీక్ చేసి మాధవ్ ను బజారులోకి లాగారని అర్ధమైపోతోంది. దాంతో ఇపుడు వ్యవహారం కురబ వర్సెస్ కమ్మగా మారిపోయింది. అనంతపురంకి చేరుకున్న మాధవ్ కు కురబలు ఇచ్చిన స్వాగతమే దీనికి నిదర్శనంగా మారింది. టీడీపీకి వ్యతిరేకంగా కురబలు ఏకమవుతున్నట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: