అమరావతి : జగన్ అనుకుంటే చంద్రబాబు, పవన్ విషయం తేలిపోతుందా ?

Vijaya






చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విషయం తేలిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనొకటుంది. అదేమిటంటే హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో వెంటనే రాజీనామా చేయించటం. ఎంపీ పదవికి రాజానామా చేయించి ఉపఎన్నిక తెప్పిస్తే దెబ్బకు చంద్రబాబు, పవన్ విషయం ఏమిటో తేలిపోతుంది. మాధవ్ రాజీనామాకు చంద్రబాబు, పవన్ కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా ? ఉంది పెద్ద సంబంధమే ఉంది.



ఇంతకీ ఆ సంబంధం ఏమిటంటే ఎంపీ రాజీనామాతో ఉపఎన్నిక వస్తే అప్పుడు పోటీలో ఉండేదెవరనే విషయంలో క్లారిటి వస్తుంది. వైసీపీ ఎలాగు పోటీచేస్తుంది. అపుడు టీడీపీ, జనసేన, బీజేపీలు ఏమిచేస్తాయి ? ఇదేమీ మరణంకారణంగా జరిగే ఉపఎన్నిక కాదుకాబట్టి కచ్చితంగా టీడీపీ, జనసేన పోటీచేయాల్సిందే. వైసీపీని ఎదుర్కునేందుకు టీడీపీ ఏమిచేస్తుందో తెలిసిపోతుంది. అలాగే జనసేన ఒంటరిగా పోటీచేస్తుందా లేకపోతే బీజేపీతో కలుస్తుందా లేకపోతే టీడీపీకి మద్దతుగా నిలుస్తుందా తేలిపోతుంది.



వచ్చే ఎన్నికల్లో పోటీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ బండారం బయటపడిపోతుంది. తమకు ఎవరితోను పొత్తులేదని డైరెక్టుగా జనాలతోనే జనసేనకు పొత్తుంటుందని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అదే నిజమైతే జనసేన ఒంటరిగా పోటీచేయాలి. అప్పుడు మిత్రపక్షమైన బీజేపీ ఏమిచేస్తుంది ? తమ రెండుపార్టీలు మిత్రపక్షాలే అనేది రుజువుచేసుకోవాలంటే కచ్చితంగా ఒకరికి మరొకరు మద్దతిచ్చుకోవాల్సిందే తప్ప వేరేదారిలేదు.  అప్పుడు ఉపఎన్నిక ముక్కోణపు పోటీ అవుతుంది.




అలాకాదని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులు పోటీచేస్తే పోటీ చతుర్ముఖమవుతుంది. అప్పుడు వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా చూసుకున్నా హిందుపురం ఉపఎన్నిక భవిష్యత్తు పొత్తు రాజకీయాలపై క్లారిటి ఇచ్చినట్లవుతుంది. కాబట్టి ఎలాగు మరకపడింది కాబట్టి జగన్ చొరవతీసుకుని మాధవ్ తో చెప్పి ఎంపీగా రాజీనామా చేయించాలి. ఇపుడు రాజీనామా చేయించినా ఉపఎన్నిక వెంటనే జరిగదు. వచ్చే డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటే హిందుపురం ఉపఎన్నిక జరిగేందుకు అవకాశముంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జగన్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే పార్టీకి వ్యక్తిగతంగా తనకు చాలామంచిదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: