నాగుల పంచమి వేడుక.. విష నాగులను మెడలో వేసుకొని?
ఈ క్రమంలోనే నాగుల పంచమి వచ్చిందంటే చాలు ఇక ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సమీపంలో ఉన్న గుడికి వెళ్లడం లేదా సమీపంలో ఎక్కడైనా పాముల పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా నాగులమ్మ కటాక్షం దక్కుతుందని ఎంతో మంది భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇలా నాగుల పంచమి సమయంలో పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోయడం లేదా కోడిగుడ్లను పుట్ట దగ్గర ఆహారంగా పెట్టడం లాంటివి మాత్రమే చూశాము.
కానీ బీహార్లో మాత్రం నాగ పంచమి వేడుకలు వినూత్నంగా కాస్త విచిత్రంగా జరిగాయని చెప్పాలి. బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చాట్ మండలం పాగాపూర్ గ్రామస్తులు భిన్నంగా నాగ పంచమి వేడుకలు జరుపుకున్నారు. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఒక నీటి నుంచి పాములను బయటకు తీస్తారు. వాటిని చేతిలో పట్టుకోవడం మెడలో వేసుకోవడం లాంటి విన్యాసాలు చేస్తారు. అంతేకాదు మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇవేవీ సాధారణ పాముల అంటే అది కూడా కాదు. ఎంతో విషపూరితమైన పాములు. ఇలాంటి విషపూరితమైన పాములని చేతిలో పట్టుకొని భక్తి శ్రద్ధలతో ఇక నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటారు. ఇక ఈ ఆచారం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.