సామన్యులకు ఊరట.. త్వరలో దిగి రానున్న నూనె ధరలు..
ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించేందుకు బుధవారం ప్రభుత్వం ముఖ్యమైన సమావేశం నిర్వహించనుంది. నివేదికల ప్రకారం.. రిటైల్ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరను తగ్గించడానికి ఈ సమావేశం నిర్వహించ బడుతుంది.ఈ సమావేశంలో చమురు ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులందరినీ పిలవనున్నారు. MRPలో మార్పు గురించి విక్రేతలకు సూచనలను జారీ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధర తగ్గింది. ఈ ప్రయోజనం సామాన్య ప్రజలకు చేరాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు..
ఆయిల్ ధరలో 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పండుగ సీజన్ కూడా దగ్గర పడుతోంది. ద్రవ్యోల్బణం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో ధర 10-15 శాతం తగ్గితే, అప్పుడు ప్రజలకు చాలా ఉపశమనం ఉంటుంది. గతంలో ఎడిబుల్ ఆయిల్ ధరలో మార్పు వచ్చి దాని ధర లీటరుకు రూ.10-15 తగ్గింది.రానున్న రోజుల్లో ధర మరింత తగ్గుతుందని అంచనా ఉంది. కొన్ని దేశాలు ఎడిబుల్ ఆయిల్ ఎగుమతిపై నిషేధం విధించాయని, దాని కారణంగా వారి స్టాక్ చాలా ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. దాని కారణంగా ధరలో పతనం ఉంది. దీంతో పాటు దేశీయ మార్కెట్‌కు ధర తగ్గుదల దగ్గరలోనే ఉంది..భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ డిమాండ్ దాదాపు 250 లక్షల టన్నులు ఉండగా, ఉత్పత్తి 110 నుంచి 112 లక్షల టన్నులు మాత్రమే.ప్రస్తుతం అన్నీ బ్రాండ్ ల పై నూనె ధరలు భారీగా తగ్గనున్నాయి..