అమరావతి : జగన్తో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుందా ?

Vijaya



మీసాలు దువ్వారు..తొడలు కొట్టారు..నువ్వు కాదు మీ అమ్మ మొగుడొచ్చినా నన్ను అడ్డుకోలేరంటు సవాలు విసిరారు..నువ్వు నీ దారిలో రా నేను నా దారిలో వస్తాను ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం అని చాలెంజ్ విసిరారు. కట్ చేస్తే సీన్ అర్ధమైపోయి తోకముడుచుకుని ఏమి మాట్లాడకుండా హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇదంతా  ఎవరిగురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించే.



సమస్య ఏమిటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై అయినదానికి కానిదానికి తొడలు కొట్టుడు, చాలెంజులు చేసుడు రెగ్యులరయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా అందులోకి జగన్ను లాగేసి నోటికొచ్చినట్లు తిట్టేసి ఎంపీ తృప్తి పడిపోతున్నారు. తాజాగా భీమవరంకు నరేంద్రమోడి వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోడీతో పాటు వేదికను పంచుకోవాలని ఎంపీ అనుకున్నారు. ఇందులో తప్పులేదు కానీ దానికి ఆయన అనుసరించిన మార్గమే తీవ్ర అభ్యంతరకరం.




తాను భీమవరంలోకి అడుగుపెడితే అరెస్టు చేయటానికి పోలీసులు రెడీగా ఉన్నారంటు ఏదేదో ఊహించేసుకుని నానా రచ్చ చేశారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. తనను టచ్ చేస్తే ఆకాశం బద్దలైపోతుందని, భూకంపాలు వచ్చేస్తాయన్న స్ధాయిలో బిల్డప్ ఇచ్చారు. తీరాచూస్తే నరసాపురంకు హైదరాబాద్ లో లింగపల్లిలో రైలెక్కి బేంగపేట రైల్వేస్టేషన్లో దిగేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఎందుకిదంతా అంటే జగన్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఇపుడు అనుకుంటున్నారు.




ఇంతకీ విషయం ఏమిటంటే ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళ జాబితాలో ఎంపీ పేరులేదు. పీఎంవో నుండి జాబితా రాకపోతే ఎస్పీజీ అధికారులు ఎవరినీ దగ్గరకు కూడా రానీయరు. విషయం అర్ధమైపోయి భీమవరంలోని తన మద్దతుదారులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటు ఎంపీ హైదరాబాద్ లోనే ఆడిపోయారు. పీఎంవో నుండి వచ్చిన జాబితాలో తన పేరును తెప్పించుకోలేని ఎంపీ జగన్ కు తొడకొట్టడం, మీసాలు మెలేయటం అవసరమా ? జగన్ ముందు తొడకొట్టేముందు, మీసాలు తిప్పేముందు తన స్ధాయి ఏమిటో తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: