అమరావతి : గీతదాటితే ఫలితమిలాగే ఉంటుందా ?

Vijaya





అధికార బలాన్ని చూసుకుని విర్రవీగితే తర్వాత ఏమవుతుందనేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షనే తాజా ఉదాహరణ. గతంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి కానీ మరీ ఇలాగ ఎవరు రోడ్డునపడి వ్యవహరించలేదు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు మొత్తం ఏబీ రాజ్యమే నడిచింది. డీజీపీగా ఠాకూర్ ఉన్నా వ్యవహారాలన్నీ ఏబీ చెప్పినట్లే జరిగేవనే ప్రచారం అందరికీ తెలిసిందే.





సామాజికవర్గం కూడా ఒకటే కావటంతో చంద్రబాబు అండ చూసుకుని ఏబీ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయినట్లు అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలు ఎన్నో ఆరోపణలు చేశారు. వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మంది టీడీపీలోకి ఫిరాయించటంలో ఏబీనే కీలకపాత్ర పోషించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటివాళ్ళు ఎన్నిసార్లు ఆరోపించారో. తమ మొబైల్ ఫోన్లను ఏబీయే ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఎంత గోలచేసినా అప్పట్లో ఉపయోగం లేకపోయింది.





ఇదంతా ఏబీ ఎవరికోసం చేశారంటే కేవలం చంద్రబాబు కోసమే. చంద్రబాబంటే వల్లమాలిన ప్రేమ+జగన్మోహన్ రెడ్డంటే విపరీతమైన ధ్వేషంతోనే ఏబీ తమను ఇబ్బంది పెడుతున్నట్లు అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు టీడీపీ నేతలు కూడా తమకేదైనా పనికావాలంటే ఏబీ ద్వారానే చేయించుకునేవారట. సరే కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు కదా. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి జగన్ సీఎం అయ్యారు. దాంతో ఏబీకి కష్టాలు మొదలయ్యాయి.



అప్పటినుండి ఏదో కేసులో ఏబీని ప్రభుత్వం సస్పెండ్ చేస్తునే ఉంది. ఏబీ కోర్టుల్లో పోరాడుతునే ఉన్నారు. ఏబీ కష్టాలు ఇప్పటితో తీరేదికాదు. ఎందుకంటే ఆయనంటే వైసీపీ నేతల్లో అంతమంటుంది. ఒకపార్టీపై ఎవరికైనా అభిమానం ఉండటంలో తప్పులేదు. కానీ ఆ అభిమానంతో పార్టీ నేతగానో కార్యకర్తగానో మారిపోయి ప్రత్యర్ధిపార్టీని ఇబ్బందులు పెట్టేస్ధాయికి వెళితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోవాలి. ఇంతచిన్న విషయం  ఏబీకి తెలీకా  అలా వ్యవహరించింది ? ఎందుకు చేశారంటే మరో 30 ఏళ్ళు టీడీపీయే అధికారంలో ఉంటుందనే భ్రమతో. ఏ కారణంతో అయినా సరే హద్దుదాటితే ఏమవుతుందో అనేందుకు ఏబీ ఉదంతమే ఉదాహరణ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: