నన్ను అరెస్ట్ చేస్తే ప్రధాని ముందే అలా చేస్తా: రఘురామ కృష్ణరాజు

Purushottham Vinay
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యకమాలు ప్లాన్ చేసింది.ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో తనను అరెస్ట్ చేస్తే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. తనను అల్లూరి విగ్రహావిష్కరణ సభకు రాకుండా చూడాలని కొంత మంది నేతలు సీఎంను కోరినట్లు తనకు తెలిసిందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆజాద్ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇదివరకే తెలిపడం జరిగింది. తాను ప్రధాన మంత్రి ఈవెంట్‌కు హాజరైతే.. ఆ సభలో పోలీసులు తనను అరెస్ట్ చేయడం లాంటి పిచ్చి చేష్టలకు కనుక పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంపీ రఘురామ హెచ్చరించారు. 'నా దారిలో నేను వస్తాను ... ఇంకా నా దారిలో నేను వెళ్ళిపోతాను. ప్రభుత్వ పెద్దలు ఏమైనా పిచ్చి వేషాలు కనుక వేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే నా ప్రాణ రక్షణ గురించి అభ్యర్థించాల్సి ఉంటుంది.


భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేది పార్టీ కార్యక్రమం కాదు. అలాగే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎంగానే ఈ సభకు హాజరు కావాల్సి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తనకు ప్రభుత్వం ఇంకా పోలీసుల నుంచి ఉన్న హానిని గుర్తించి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంకా తమ పార్టీలో అల్లూరి స్ఫూర్తితో పని చేసేవారు రక్షణ కవచంగా నిలబడాలని' నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు.ఇక రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తున్న తనకు ఇంకా దుష్ట చతుష్టయం నుంచి పొంచి ఉన్న ఆపదను గుర్తించి అన్ని వర్గాల వారు అండగా నిలవాలన్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి వస్తున్న తనని చూడడానికి తన అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. అయితే సీఎం జగన్ వచ్చినా, అయన రాకపోయినా తాను మాత్రం సభకు హాజరవుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను చూసి సభల నుంచి పారిపోయే జనం ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు తరలి వస్తారని అభిప్రాయపడ్డారు.ఇక సభకు డ్వాక్రా మహిళలను తరలించేందుకు అధికారులు ఆపసోపాలు పడొద్దని, ఈ సభకు స్వచ్ఛందంగానే ప్రజలు హాజరవుతారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: