ఓరి నాయనో.. ఇంటర్ రెండు గ్రూపుల్లో పాసయ్యాడు?

praveen
ఇటీవలి కాలంలో అటు విద్యార్థులకు చదువు పేరు ఎత్తితే చాలు చిరాకు వచ్చేస్తోంది.. చదువుకోవడానికి ఎవరు కూడా అంతగా ఇష్టపడటం లేదు. కేవలం కొంత మంది విద్యార్థులు మాత్రమే మేం బాగా చదువుకోవాలి.. ఫస్ట్ ర్యాంక్  సాదించాలి అని భావిస్తున్నారు. కానీ ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం నేటి రోజుల్లో చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టడంలేదు. పరీక్షలు వచ్చాయి అంటే చాలు ఏదో ఎవరెస్టు శిఖరం ఎక్కాలి అన్నంత భారంగా ఫీలవుతున్నారు. ఇక అతి కష్టం గానే ఎగ్జామ్స్ కోసం చదువుతూ పరీక్షలు రాస్తున్నారు. ఇలా కొంత మంది ఫెయిల్ అవుతూ ఉంటే మరి కొంత మంది పాస్ అవుతున్నారు.

 ఈ క్రమంలోనే కాలేజీలకు చదువుకోమని పంపిస్తే కాలేజీకి వెళ్లడం మానేసి రోడ్లపై తిరగడం చేస్తున్న విద్యార్థులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు నేటి రోజుల్లో. ఇలా విద్యార్థులు అందరూ చదువులు అంటే భయపడుతున్న సమయంలో ఒక విద్యార్థి ఇంటర్లో రెండు గ్రూపుల లో పాస్ కావడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక గ్రూప్ చదివి పాస్ అవ్వడానికె అందరూ తంటాలు పడుతుంటే.. ఈ విద్యార్థి మాత్రం సీఈసి తో పాటు కాస్త కష్టమైన బైపీసీ లో కూడా ఉత్తీర్ణత సాధించాడు. 2017 లో సిఈసి గ్రూప్ చదివి ఉత్తీర్ణత సాధించగా ఇక ఇప్పుడు బైపీసీ పాస్ అయ్యాడు.

 అది ఎవరో కాదు హైదరాబాద్కు చెందిన అగస్త్య జైశ్వాల్. ఇక ఇంటర్ రెండు గ్రూపుల్లో పాస్ అయి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంతేకాకుండా 14 ఏళ్ళకే జర్నలిజం లో బిఏ చేసిన విద్యార్థిగా కూడా ఆగస్త్య జైశ్వాల్ రికార్డు సృష్టించాడు. అతని సోదరి నైనా జైస్వాల్ కూడా ఇదే రీతిలో సత్తా చాటింది అనే చెప్పాలి. కేవలం పదేళ్ల వయసులోనే ఇంటర్ పూర్తి చేసింది నైనా జైస్వాల్.. నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఏదేమైనా ఇక ఆగస్త్య  జైస్వాల్ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: