ఏపీ బీజేపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి?

Purushottham Vinay
ఇక ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ ఇంకా అలాగే జనసేన తర్వాత బీజేపీ ఇప్పుడు నాలుగోస్థానంలో ఉంది. వాస్తవానికి కమ్యూనిస్టులకే బీజేపీ కన్నా క్షేత్రస్థాయిలో బలం అనేది ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల ఆ పార్టీ నాలుగో అతి పెద్ద పార్టీగా ఇప్పుడు చెలామణి అవుతోంది.ఇక ఇప్పటినుంచే బలోపేతం చేస్తే ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఇక పార్టీకి దీర్ఘకాలికంగా లాభం అనేది చేకూరుతుందని ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇక అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కుమార్తె ఇంకా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి కనుక బీజేపీ అధ్యక్షురాలైతే కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె సమర్థత కూడా పార్టీకి చాలా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెంది ఇంకా ఆమె బంధువైన చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో బలమైన సామాజికవర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో మిత్రత్వం ఉంది కాబట్టి ఆ సామాజికవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నారు.


ఇక పురంధేశ్వరిని కనుక అధ్యక్షురాలిని చేస్తే ఆమె సామాజికవర్గానికి చెందినవారితోపాటు తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నేతలను కూడా బీజేపీలోకి చేర్చుకొని బలోపేతానికి బాగా కృషిచేయాలని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే సోము వీర్రాజు స్థానంలోనే పురంధేశ్వరిని నియమిస్తారంటూ గతంలోనే అనేక వార్తలు వచ్చినప్పటికీ అప్పుడు అధ్యక్ష పదవి వీర్రాజుకు దక్కింది. అయితే ఇక ఆయన అధ్యక్షుడైన తర్వాత పార్టీ ఇసుమంత కూడా బలపడలేదని పార్టీ పెద్దలు తెప్పించుకున్న నివేదికల ద్వారా కూడా వెల్లడైంది.ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సోము రూపొందించలేకపోతుండటంతో ఆయన్ను తప్పించడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలకు పురంధేశ్వరి ఒక్కటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆమె ఏపీ బీజేపీకి కనుక అధ్యక్షురాలైతే రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా మారతాయని మాత్రం బాగా స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: