"కిసాన్ యోజన" పధకం ద్వారా డబ్బులు అందాయా ?
ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ పథకాన్ని అమలు చేసింది కేంద్రం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఖాతాలో 11వ విడత డబ్బులని పోయిన నెల మే 31వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ డబ్బులు ఖాతాల్లో పడి రోజులు గడుస్తున్నప్పటికీ చాలా మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాకపోవడం గమనార్హం. అలాంటి వారు చాలామంది ఏమి చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
అయితే అలాంటి రైతులు ఏం చేయాలంటే.. ముందుగా రైతులు హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమస్యను వివరించి పరిష్కారం చూపండి అని అడిగే అవకాశం కల్పించింది కేంద్రం. మే 31న సిమ్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి 11వ విడత 2000 రూపాయలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు ఏకంగా రూ.21,000 కోట్లు పంపారు పిఎం. కానీ చాలా మంది రైతులకు ఈ డబ్బు అకౌంట్లోకి జమ కాలేదు అని వాపోతున్నారు. అన్ని వివరాలు సరిగానే ఉన్నప్పటికీ ఇంకా తమ ఖాతాల్లోకి డబ్బులు రాలేదు అని చెబుతున్నారు. ఇందులో పోయిన సారి లబ్ది పొంది తీసుకుని ఈసారి డబ్బు అందని వారున్నారు.
చాలా మంది పేర్లు మునుపటి జాబితాలో ఉన్నాయి. కానీ కొత్త జాబితాలో లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. చివరిసారి డబ్బు వచ్చింది కానీ ఈసారి రాలేదు అంటూ బాధపడుతున్నారు. కాగా అలాంటి రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని తెలుసుకోండి. దీని కోసం హెల్ప్‌లైన్ నంబర్ అయిన 011-24300606 కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్ కు కాల్ చేసి మీ సమస్యను చెప్పొచ్చు. వారు మీకు ఎందుకు డబ్బులు అందలేదు...ఎపుడు అందే వీలు ఉంది వంటి సంబంధిత వివరాలను తెలియజేస్తారు.
PM కిసాన్ టోల్ ఫ్రీ నంబరు - 18001155266
PM కిసాన్ ల్యాండ్ లైన్ నంబర్లు కూడా ఉన్నాయి: 011-23381092, 23382401
PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ వచ్చి:155261
PM కిసాన్ కొత్త హెల్ప్‌లైన్ నంబరు : 011-24300606
PM కిసాన్‌కు మరొక హెల్ప్‌లైన్ నెంబర్: 0120-6025109
ఈ నంబర్లకు ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చు.