ఎలుకల బోను తయారు చేసి.. గిన్నిస్ రికార్డు కొట్టాడు?

praveen
ప్రతి ఒక్కరికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునీ ఏకైక ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకోవాలని ఉంటుంది. కానీ గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం అంటే అంత సులభమైన విషయం కాదు కదా.. ఇలా ప్రపంచ రికార్డు కొట్టడానికి మనలో ఏదో ప్రత్యేకమైన టాలెంట్ దాగి ఉండాలి. ఎంత ప్రత్యేకమైనది అంటే ప్రపంచంలో ఉన్న ఎవరి దగ్గర లేని సరికొత్త టాలెంట్ మీ దగ్గర ఉంటేనే అప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు సాధించడానికి అవకాశం ఉంటుంది.. ఇటీవల కాలంలో అయితే ఏకంగా గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి కొంతమంది ఊహించని విధంగా సాహసాలు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు.

 మొన్నటికి మొన్న ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు కోసం ఏకంగా రెండు ఎయిర్ బెలూన్స్  మధ్య ఒక చిన్న తాడు కట్టుకుని వేల అడుగుల ఎత్తులో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ దానిపై నడిచి గిన్నిస్ బుక్ రికార్డు కొట్టారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా గిన్నిస్ బుక్ రికార్డు కొట్టడం  కూడా ఇప్పటివరకు మనం చాలానే చూశాం. కానీ ఎలుకల బోను తయారు చేయడం కారణంగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం ఎప్పుడైనా జరుగుతుందా. ఊరుకోండి బాసు ఎలుకల బోను తయారు చేస్తే గిన్నిస్ బుక్ రికార్డ్ కొట్టడం ఏంటి ఎవరికైనా చెబితే నవ్వుకుంటారు అని అంటారు ఎవరైనా.

 కానీ అలా అనుకున్నారంటే మాత్రం మీరు పొరపాటు చేసినట్లే. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి నిజంగానే ఎలకల బోను తయారు చేసి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ చిన్న సైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించాడు. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు కొట్టాడు. 5 మిల్లీమీటర్ల పొడవు 2.5 మిల్లీ మీటర్ల వెడల్పు తో కేవలం 29 నిమిషాల్లోనే ఇక ఎలకల బోను తయారు చేశాడు. పదేళ్ల క్రితం ఒక భారతీయుడు గంటలో సూక్ష్మ బోను తయారు చేయగా దయాకర్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. గత డిసెంబర్ 2వ తేదీన అధికారుల సమక్షంలో నిబంధనల మేరకు ఆ బోన్ తయారుచేసి పంపగా.. ఇటీవలే గిన్నిస్ బుక్ రికార్డు అతని వరించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: