యూరిన్ తో బీర్.. మార్కెట్ లో భలే డిమాండ్?

praveen
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే ఫ్రిజ్ లో ఎంతో కూల్గా ఉండే వాటర్ తాగుతూ ఉన్నారు. కొంతమంది కూల్ డ్రింక్ లతో సరిపెట్టుకుంటున్నారు. మరి ఇలా ఎండలు దంచి కొడుతూఉంటే మందుబాబులు ఏం చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే. చల్లని బీరు తీసుకొని గుటగుట తాగేస్తుంటారు. కేవలం మందుబాబులే కాదండోయ్ ఇక వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ కూడా నేటి రోజుల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లటి బీర్లు తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

 దీంతో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా బీర్ల అమ్మకాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి అన్నది అందరికి తెలిసిందే. ఇలా స్టాక్ వచ్చిందో లేదో అలా ఖాళీ అయిపోతుంది. అంతలా ఇప్పుడు వేసవి కాలంలో బీర్ లకు డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి. ఎండాకాలంలో చల్లటి బీరు తాగుతూ ఏకంగా అమృతం తాగుతున్నట్లు గా తెగ ఆనందపడి పోతున్నారు జనాలు. ఇలాంటి సమయంలోనే ఇటీవలే ఒక బీర్ కంపెనీ మందుబాబులు అందరికీ శుభ వార్త చెప్పింది. సరికొత్త బీర్  అందుబాటులోకి తీసుకువచ్చింది. సింగపూర్కు చెందిన న్యూ బ్రూ కంపెనీ.

 ఇక ఇది ఎలా తయారవుతుందో తెలిస్తే మాత్రం తప్పకుండా షాక్ లో మునిగిపోతారు. ఈ బీర్ మూత్రం 20 ఏళ్ల నాటి మురుగు నీటిని శుద్ధి చేసి తయారు చేస్తారట. ఈ విషయం తెలియగానే కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది కదా. కానీ ఈ బీర్ కి మాత్రం మంచి డిమాండ్ ఉందట. యూరిన్ బీరు గా విడుదలైన ఈ బీరు టేస్ట్ అద్భుతంగా ఉండడంతో ఇక ఎంతోమంది మందుబాబులు ఈ బీర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. నీటి కొరత పై అందరిలో అవగాహన పెంచేందుకు ఇక సింగపూర్ వాటర్ ఏజెన్సీ  ఈ సరికొత్త బీరు ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా యూరిన్ తో బీరు అంటే బీరు తాగే వాళ్లు కూడా మానేస్తారేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: