బ్రేక్ ఫస్ట్ తర్వాత టీ ఇవ్వలేదని.. లక్ష రూ.ల జరిమానా?

praveen
ఇటీవలి కాలంలో భారత రైల్వే ప్రయాణికులు అందరికీ ఎప్పుడు మెరుగైన.. ఎంతో సౌకర్యమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు ఇబ్బంది గురి చేసే విధంగా ఏదైనా అంశం తెర మీదికి వస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఇకపోతే ఇటీవల రైలు ప్రయాణికులకు ఆహారం అందించేందుకు భారత రైల్వే పలు సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు ఇచ్చి ఊరుకోకుండా ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు  అందుతున్నాయా లేదా అని అనుక్షణం నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

 ఇకపోతే ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ ఇవ్వలేదు అన్న కారణంతో ఏకంగా కాంట్రాక్టు సంస్థకు ఐఆర్సిటిసి లక్ష రూపాయలు జరిమానా విధించడం సంచలనంగా మారిపోయింది. రైళ్లల్లో అందుతున్న సేవలు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ తనిఖీలు చేపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఆ టీం జనశతాబ్ది ఎక్ష్ప్రెస్ లో ప్రయాణించింది. {{RelevantDataTitle}}