పోలవరం పరిహారంలో రూ.300 కోట్ల అవినీతి?

Chakravarthi Kalyan
పోలవరం నిర్వాసితులకు పరిహారం విషయంలో గోల్ మాల్ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పరిహారం విషయంలో వైసీపీ నేతల ప్రమేయంతో 300 కోట్ల రూపాయల వరకూ గోల్ మాల్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోరాట దీక్ష చేస్తున్నారు. దేవీపట్నం మండలం గుబ్బలంపేటలో నకిలీ డీపట్టాలు సృష్టించి మూడు కోట్ల రూపాయలుపైగా స్వాహా చేశారని వంతల రాజేశ్వరి ఆరోపించారు.


మిగతా గ్రామాల్లోనూ అధికార వైసీపీ నాయకుల అండదండలతో పరిహారం దందా కొనసాగిందని  తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. అంతే కాదు.. బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని  తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శిస్తున్నారు.  తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చేపట్టిన పోరాట దీక్షను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సందర్శించారు.


నిర్వాసితులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఉమా వద్ద చెప్పుకున్నారు. అధికార పార్టీ అండదండలతోనే పరిహారంలో 300 కోట్ల రూపాయలపైనే అవినీతి జరిగిందని దేవినేని ఉమా ఆరోపించారు. ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేసుకుంటూ ఐటీడీఏ పీవో కార్యాలయంలోకి వెళ్లి టీడీపీ వినతులు సమర్పించారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ నోరు మెదపడం లేదని టీడీపీ నాయకులు విమర్శించారు.


ఏపీ సీఎంగా జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పెడింగ్‌లో పడిందన్న ప్రచారం జోరందుకుంది. అయితే.. చంద్రబాబు కాలంలో నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని.. కానీ తాము మాత్రం ముందు నిర్వాసితులకు న్యాయం చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే.. న్యాయం పేరిట అవినీతి జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపితే అక్రమాలు ఏమైనా ఉంటే వెలుగు చూస్తాయి. మరి ప్రభుత్వం ఈ ఆరోపణలను పట్టించుకుంటుందా?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: