పవన్ కళ్యాణ్ ను "బిచ్చా నాయక్" అన్న మాజీ మంత్రి?

VAMSI
ఏపి రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రత్యర్ధి పార్టీలకు మద్య రణరంగం ఓ పట్టున కాసేపైనా కుదురుగా ఉండేలా లేదు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ప్రముఖ వైసిపి నేత అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. అదే విధంగా ప్రజా సేవ గురించి చెప్పుకొచ్చారు. మంత్రి పదవి లేకున్నా తగ్గేదే లేదని తమ సేవలు యధాతదం కొనసాగుతాయని, నిజానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం ప్రజలతో కలిసి గడిపే తీరిక దొరికింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. ఇపుడు గడప గడపకు వెళ్లి ప్రజల్ని నేరుగా కలిసే కార్యక్రమం మొదలు పెడతామన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తామన్నారు.

సిఎం జగన్ మోహన్ రెడ్డి తమకు దైవంతో సమానమని, పదవి ఉన్నా లేకున్నా ఆయన వెంటే ఉంటూ సైనికుడిలా ప్రజల కొరకు పనిచేయడమే తమకు అత్యంత గౌరవమని అన్నారు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ గారిని గెలిపించి తీరుతామని ప్రజల కోరిక కూడా అదేనని అన్నారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్నారు. మంత్రి కాకాణి తన  ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపలేదని తెలిపారు. అయినా ఆయనపై గౌరవం తగ్గదని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన అధినేతపై నిప్పులు చెరిగింది వైకాపా నేత అనిల్.  రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కాదని టిడిపి నేతల దగ్గర బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టిడిపికి వంత పాడుతూ వారి దగ్గర సీట్లు అడుక్కునే ఇలాంటి వ్యక్తి నాయకుడే కాదని, అలాంటిది సీఎం ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. కాగా ఇపుడు ఈ వ్యాఖ్యలకు జనసేన అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: