షాకింగ్ న్యూస్.. జగన్ మంత్రివర్గం రాజీనామా?

praveen
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదని అందరికీ మంత్రి పదవి వచ్చే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా హామీ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఏర్పడిన మంత్రివర్గం ఇక రెండున్నర సంవత్సరాల తర్వాత రాజీనామా చేస్తారని ఇక అప్పుడు మళ్ళీ కొత్త మంత్రివర్గం ఎన్నుకోవడం జరుగుతుంది అని సీఎం జగన్ చెప్పారు. అయితే ఇక జగన్ పాలన మొదలై రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో  కొత్త మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు అన్నది ఇప్పుడు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అటు తొలి కేబినెట్ మంత్రులు అందరికీ కూడా చివరి సమావేశం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇన్ని రోజుల పాటు ఇక మంత్రులుగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేసిన అందరి పై ప్రశంసలు కురిపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సమావేశం ముగిసిన అనంతరం తొలి క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా రాజీనామా చేయడం గమనార్హం. సీఎం జగన్ కు మంత్రులు రాజీనామా లేఖలను అందజేశారు.

 ఇక ఈ రాజీనామా లేఖలను జగన్ గవర్నర్కు పంపనున్నారు అన్నది తెలుస్తుంది. ఇక అంతా ముందు నుంచే ప్లాన్ ప్రకారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పుడు తొలి మంత్రివర్గం రాజీనామాతో ఇక కొత్త మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఎంతో మంది మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు ఉన్నారు. ఇక వారందరికీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా ఎవరైనా కొత్తవారు తెరమీదికి వస్తారా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: