వార్నీ.. ఎగ్జామ్ లో కూడా పుష్ప డైలాగులే.. రాసేదేలే అంటూ?
విదేశీ క్రికెటర్లు సైతం ఇక ఈ పాట పై స్టెప్పులు వేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతే కాదు సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీలు క్రికెటర్ల వరకు ప్రతి ఒక్కరు తగ్గేదేలా అంటూ డైలాగ్ చెబుతున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఈ డైలాగ్ వాడుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. చివరికి ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ డైలాగ్ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక వసూళ్లలో సునామీ సృష్టించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు విద్యార్థులు కూడా పుష్ప మేనియా లోనే మునిగితేలుతున్నారు అన్నది తెలుస్తుంది.
ఈ సినిమా వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇంకా ట్రెండ్ మాత్రం అదే రేంజ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు పుష్ప ఫీవర్ ఎగ్జామ్స్ కి కూడా పాకిపోయింది అని తెలుస్తోంది. సాధారణంగా ఎగ్జామ్స్ సమయంలో కొంతమంది విద్యార్థులు చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఆన్సర్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే పశ్చిమబెంగాల్లో పరీక్ష రాస్తున్న ఓ జాతిరత్నం ఏకంగా ఎగ్జామ్ లో ఆన్సర్ కి బదులు పుష్ప డైలాగులు రాసేశాడు. పుష్ప పుష్ప రాజ్ రాసేదేలే అంటూ ఆన్సర్ రాశాడు. దీనికి సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది..