అమరావతి : చంద్రబాబును దెబ్బకొట్టడానికే జగన్ బారీ కసరత్తు

Vijaya



రాజకీయమంటేనే ప్రత్యర్ధులను లేవకుండా దెబ్బకొట్టడమే కదా. 2014, 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య జరిగిందిదే కదా.2014లో చంద్రబాబు కొట్టిన దెబ్బను జగన్ తట్టుకుని నిలబడ్డారు. అయితే 2019లో జగన్ కొట్టిన దెబ్బనుండి చంద్రబాబు ఇప్పటికీ పైకి లేవలేదు. ఎన్నికలు ఏవైనా సరే జగన్ దెబ్బమీద దెబ్బ కొడుతునే ఉన్నారు. అందుకనే వరుస దెబ్బలకు చంద్రబాబు లేవలేకపోతున్నారు.



2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబును దెబ్బకొట్టడమే టార్గెట్ గా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తొందరలో చేయబోయే మంత్రివర్గ ప్రక్షాళనను వేదికగా చేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటినుండి టీడీపీకి బలం బీసీలే. బీసీల మద్దతు కారణంగానే 40 సంవత్సరాలుగా టీడీపీ అప్రతిహతంగా కంటిన్యు అవుతోంది. అలాంటి బీసీల్లో మొదటిసారి చీలికవచ్చింది 2019 ఎన్నికల్లోనే. బీసీల్లో వచ్చిన చిన్న చీలికకే టీడీపీ బెంబేలెత్తిపోతోంది.



అప్పటివరకు ఏకపక్షంగా టీడీపీకే మద్దతుగా నిలిచిన బీసీల్లో చీలికవచ్చి వైసీపీకి మద్దతుగా నిలిచారు. బీసీలను తనవైపుకు తిప్పుకునేందుకు జగన్ చాలా చాలా కష్టపడాల్సొచ్చింది. వైసీపీకి మద్దతిచ్చిన బీసీలను జగన్ కూడా బాగా అందలాలే ఎక్కించారు. ఇపుడు విషయం ఏమిటంటే కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో ఎక్కువమంది బీసీలనే తీసుకోబోతున్నారట. అంటే 24 మంది మంత్రుల్లో కనీసం 10 మందిని బీసీల నుండే తీసుకోవాలని జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నారట.



ఇప్పటికే ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీల్లో బీసీలకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. దీనికి అదనంగా మంత్రివర్గంలో కూడా బీసీలకే అధిక ప్రాధాన్యతిస్తే టీడీపీ పనైపోయినట్లే. పైగా చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు వచ్చేసింది. లోకేష్ ను నమ్ముకుంటే లాభంలేదని తేలిపోయింది. ఇదే సమయంలో తమకు జగన్ ఇస్తున్న టాప్ ప్రయారిటిని బీసీలు గుర్తించారు. ఈ విషయం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రుజువైంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైపు బీసీలు మరింతమంది పోలరైజ్ అయితే టీడీపీ గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: