పెట్రోల్ మంట.. వాళ్లకు రూ. 19 వేల కోట్ల తంటా?
అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా లాభపడిందెవరో కానీ.. పెట్రోల్ సంస్థలు మాత్రం తీవ్రంగా నష్టపోయాయట. ఎందుకంటే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఎన్నికల సందర్భంగా దేశంలో ప్రభుత్వరంగ చమురు
సంస్థలు ఆ మేరకు ధరలను సవరించలేదు. దీని కారణంగానే ఈ సంస్థలు భారీగా నష్టపోయినట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. మార్చి నెలలోనే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ అన్నీ కలిపి 19వేల కోట్లు నష్టపోయినట్లు మూడీస్ సంస్థ అంచనా వేసింది.
ఇందుకు సంబంధించిన లెక్లు చూస్తే.. నవంబర్‌లో బ్యారెల్ చమురు ధర 82 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత మార్చిలో దీని ధర 111 డాలర్లకు చేరింది. అప్పుడు ఒక్కో బ్యారెల్ పెట్రోల్‌పై 25 డాలర్లు, డీజిల్‌పై 24 డాలర్ల చొప్పున దేశంలోని ఆయల్ సంస్థలు నష్టపోయాయట. ఇప్పడు కాస్తో కూస్తో పెట్రోల్ రేట్లు పెంచుతున్నా.. అదేమంత ఎక్కువ కాకపోవచ్చు. అందుకే ఇలాగే పెట్రోల్ ధరలు పెంచకుండా ఉంటే.. రోజుకు 65నుంచి 70మిలియన్ డాలర్ల మేర నష్టపోతామని పెట్రోల్ సంస్థలు అంటున్నాయి.
కేవలం గత నవంబర్ నుంచి మార్చి తొలివారం వరకు జరిగిన అమ్మకాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చిలోని తొలి మూడు వారాల్లోనే 2.25 బిలియయన్ డాలర్లు నష్టపోయాయట. ఈ విషయాన్ని మూడీస్ సంస్థ తెలిపింది. 5రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి మంగళ, బుధవారాల్లో మళ్లీ ధరలు పెంచేశాయి చమురు సంస్థలు.