కేసీఆర్ వర్గంలో.. మోడీ ఇన్ఫార్మర్.. ఎవరో తెలుసా..!

MOHAN BABU
తెలంగాణ పై కమలనాధుల వ్యూహం ఊపందుకున్నది. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీలోని అసంతృప్తులను లాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బిజెపి,వచ్చే నెలలో అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరిని పార్టీలో చేర్చుకోనున్నది. టిఆర్ఎస్ పట్ల మాత్రం భిన్నమైన తీరులో స్కెచ్ వేసింది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అంతర్గత సమాచారాన్ని కెసిఆర్ సేకరిస్తున్నట్లుగానే,టిఆర్ఎస్ లోని తాజా అప్డేట్స్ కోసం బలమైన ఇన్ఫార్మర్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నది. 
 ముల్లును ముల్లుతోనే తీసే ఎత్తుగడను రూపొందిం చుకుంది. ఈ ఏడాది చివరికల్లా ఫస్ట్ ఫెజ్ స్ట్రాటజీని పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అరడజను మంది తో సంప్రదింపులను పూర్తి చేసింది. పార్టీ మారడానికి గ్రౌండ్ రెడీ అయింది.

 రెండు వైపులా ముహూర్తం కుదిరితే కండువా మార్చుకోవడమే తరువాయి ప్రతి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నవారెవరానేది గుర్తించింది. ఇందుకోసం జిల్లాకో టిమ్ ను ఏర్పాటు చేసుకున్నది. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలో చేర్చుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఉత్తరాది తో పోలిస్తే దక్షిణాది జిల్లాల్లో ఈ ప్రక్రియ ఒకింత వేగంగా సాగుతుంది. టిఆర్ఎస్ విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడే ఎవరిని టచ్ చేయవద్దనే ఎత్తుగడను అవలంబిస్తున్నది. ప్రస్తుతం పార్టీ తో అంటీ ముట్టనట్లుగా ఉన్న సీనియర్ లీడర్లు వారంతట వారు నిర్ణయం తీసుకుంటే చేర్చుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నది.అక్కడ యాక్టివ్ గా ఉన్న వారి జోలికి మాత్రం వెళ్లొద్దని జాగ్రత్తలు తీసుకుంటున్నది. టిఆర్ఎస్ లో ఉంటూనే ఆ పార్టీ కదలికలను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించేలా ఇన్ ఫార్మర్ తరహాలోనే నాయకులను వాడుకోవాలనుకుంటుంది.

అన్ని జిల్లాల్లోనూ కనీసంగా ఒకరు చొప్పున ఇలాంటి వ్యక్తులు తనవైపు తిప్పుకుంది. ఎన్నికల సమయంలో అధికార పార్టీలో టిక్కెట్ రాకపోతే వెంటనే బిజెపి తరఫున పోటీ చేయంచడమే ఈ వ్యూహం. ఆ మేరకు హామీలను కూడా ఇచ్చింది. టికెట్ వస్తుందో రాదో అని అనుమానంతో ఉన్న వారితో కమలం పార్టీ తన పని కానిస్తున్నది. అప్పటి వరకు ఎలాంటి అనుమానం రాకుండా టిఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టిన బిజెపి నాయకత్వం పట్టించుకోదు. ఇలాంటి ఇన్ఫార్మర్ల లో ఇద్దరు మంత్రులు,కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు బీజేపీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తో సంబంధం లేని వ్యక్తుల ద్వారా ఇన్ఫార్మర్ నెట్వర్క్ పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: