గుడ్‌న్యూస్‌: హైదరాబాద్‌లో ఇవాళ ఆ ఫ్లైఓవర్‌ ప్రారంభం!

Chakravarthi Kalyan
హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త..  హైదరాబాద్‌‌లోని ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులకు ఇది నిజంగా శుభవార్తే. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు ఎల్బీనగర్ అండర్ పాస్, బైరమల్ గూడ  ఫ్లైఓవర్లు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎల్బీనగర్ అండర్ పాస్‌ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తోంది. అలాగే రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరమల్ గూడ ఫ్లైఓవర్‌‌ కూడా ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వస్తోంది.


ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించారు. ప్రజా రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రెండు ప్రాజెక్టులు చాలా ఉపయోగపడతాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడతాయి. అంతే కాదు.. సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి.


ఈ రెండు ప్రాజెక్టులను ఎస్.ఆర్.డి.పి పథకంలో భాగంగాప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎస్‌ఆర్‌డీపీలో నగరం నలువైపులా ఫ్లై ఓవర్లు, స్కై వేలు, మేజర్ కారిడార్లు, గ్రేడ్ సఫరేటర్లు, అండర్ పాస్ నిర్మాణాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ఒకటైన ఎల్‌బి నగర్ కూడలిలో అండర్ పాస్, ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ఈ ప్రాజెక్టులో భాగంగానే చేపట్టారు. ఈ కూడలిలో వరంగల్, నల్గొండ ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


ఈ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలు ఉపయోగపడతాయి. ఎల్‌బి నగర్ కూడలి (RHS) ఎడమవైపు రూ. 40 కోట్ల వ్యయంతో అండర్ పాస్ నిర్మించారు. 13 మీటర్ల వెడల్పుతో 73 మీటర్ల బాక్స్ పోర్షన్ తో 3 లేన్ ల యుని డైరెక్షన్‌లో ఈ అండర్ పాస్ నిర్మాణం కావించారు. ఈ ప్రాజెక్టులతో ఎల్‌బీనగర్ కూడలిలో ట్రాఫిక్ సమస్యలు తీరినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: