"బీజేపీ"ని ప్రజలు అందుకే గెలిపించారా ?
యూపీ లో మొత్తం 273 స్థానాలను గెలుచుకుంది. యూపీ చరిత్రలో యోగి చరిత్ర సృష్టించారు. ఇక పంజాబ్ లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అధికారాన్ని కాంగ్రెస్ నుండి చేజిక్కించుకుంది. అయితే బీజేపీ కి మళ్లీ ప్రజలు ఎందుకు పట్టం కట్టారు అన్న విషయం ఇప్పటికీ అంతుబట్టడం లేదు. అయితే బీజేపీ ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుందో వాటిని తిరిగి సరిచేసుకోవడానికి దాదాపుగా ప్రయత్నించింది. దాదాపుగా అన్ని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చనివి తీసుకుంటూ ఉంటాయి. తెలిసిన తర్వాత అయినా సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. కానీ ఇక్కడ బీజేపీ ఆ తప్పు చేయలేదు.
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రైతు చట్టాలు, దేశ వ్యాప్తంగా ఎంతటి వ్యతిరేకతను రేపాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటిని రద్దు చేయాలని రైతులు అంతా రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అలా రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న కొత్త రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది మోదీ ప్రభుత్వం. దీనితో కొంత మేరకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు కాస్త చల్ల బడ్డారు. పైగా ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీ ప్రజలను చేరువయ్యే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజల ప్రస్తుతం సమస్యల గురించి చర్చిస్తూ తమకు మించిన ప్రత్యామ్నాయం లేదని కొన్ని సంఘటనల ద్వారా చక్కగా వివరిస్తారు. ఈ విషయంలో మోదీ - యోగి - అమిత్ షా ల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ఇప్పుడు వీరి దృష్టి మాత్రం దక్షిణాది రాష్ట్రాలపై పడింది అని తెలుస్తోంది. మరి చూద్దాం భవిష్యత్తులో ఏమి జరగుతుంది అనేది ?