తెలుగు రాష్ట్రాల్లో మార్వాడీ మాఫియా.. వైరల్ మెస్సేజ్‌?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మార్వాడీల దుకాణాలు ఉంటాయి. వారు అనేక వ్యాపార రంగాల్లో ఉన్నారు. ప్రత్యేకించి వడ్డీ వ్యాపారం, కిరాణా షాపులు ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే.. ఈ మారవాడీ వ్యాపారులు బ్రిటిష్ కంటే ప్రమాదం అంటూ ఓ మెస్సేజ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరు హిందుత్వ ముసుగులో కులాల వ్యాపారాలు చేస్తున్నారని.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర  చేస్తున్నారని ఆ సందేశం చెబుతోంది.

ఆ సందేశం ఇలా ఉంది.

రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ప్రతి వ్యాపారం లోను మార్వాడీలు ఎంటర్ అయ్యారు. ఈస్టిండియా కంపెనీ మాదిరి తెలుగు రాష్ట్రలలో జిలేబి, పానీ పూరి, సమోసా వ్యాపారాలతో మొదలెట్టారు.  అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి చేరారు. ఇల్లు, వ్యాపారాలు 60 శాతం మించి వారు కైవసం చేసుకుంటున్నారు. మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు  అన్నీ కూడా మార్వాడి వాళ్ళవే.  మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన వ్యాపారస్తులకు ఇవ్వనే ఇవ్వరు. డబ్బు ఎవరికీ ఊరికే రాదు కదా అని ఓ గుండు ఆయన చెప్పిన సూక్తిని మన వాళ్ళు బాగా పాటిస్తారు. రూపాయి తగ్గుతుంది కదా అని మార్వాడి వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ బహుజన కులాల వ్యాపారస్తులకు మొండి చేయి చూపుతున్నారు.


ఇలా కొనసాగితే కొన్నాళ్ళకు మార్వాడి సేట్ల దగ్గర బానిసలాగా బతికే రోజు దగ్గర్లోనే వస్తుంది. మార్వాడీలు, గుజరాతి, రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం వచ్చి మత పర విభేదాలకు ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు. స్థానిక వ్యాపారాలను దెబ్బ తీస్తున్నారు. మతం మత్తులో ఉత్తర భారతీయ మత సామూహిక వినాయక విగ్రహాలు, హనుమాన్ ఊరేగింపులకు ప్రోత్సహిస్తున్నారు. మన చుట్టు పక్కల, చౌరస్తాలలో, డబుల్ సెట్టర్ దుకాణాలు కొత్తగా ఎవరు పెడుతున్నారో పరిశీలించండి.  చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బ తీస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారం అంటూ మార్వాడీలు మొత్తం దక్షిణ భారత దేశంలో హిందూ మత ముసుగులో దిగుతున్నారు. తస్మాత్‌ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: