టీడీపీ తీరు మారలేదుగా... "గవర్నర్ గో బ్యాక్ అంటూ గోల"?
గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ను ఏపి సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతూ అసెంబ్లీ లోకి ఆహ్వానించారు.
అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, మును ముందు అభివృద్ధి తదితర అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర వికేంద్రీకరణ తోనే ఏపి రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చారు. ఉగాది నుండి నూతన జిల్లాలలో పాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే అక్కడున్న టిడిపి సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ గర్జించడం గమనార్హం.
అయితే ఇలా అసెంబ్లీ నియమాలను అతిక్రమించడం ఎంత వరకు సబబు అనేది ఒకసారి ప్రతిపక్ష టీడీపీ ఆలోచించుకోవలసిన అవసరమా ఎంతైనా ఉందని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఏపీ గవర్నర్ పట్ల అలా ప్రవర్తించడం మంచిది కాదంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. తమకు అభ్యంతరాలు ఏమైనా ఉంటె చర్చలోనే చెప్పవచ్చు. కానీ ఈ తరహా గా సభ నుండి వాక్ అవుట్ చేయడం హేయమైన చర్య అని పలువురు విమర్శిస్తునారు. అయితే ఇదేమీ మొదటిసారి కాకపోయినా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఇలా చేయడంతో వివాదం అవుతోంది.