రష్యా హస్తగతం చేసుకున్న "అణు విద్యుత్ ప్లాంట్" తో పొంచి ఉన్న భారీ ప్రమాదం... ?
అయితే ఈ విద్యుత్ కేంద్రం నుండి ఉక్రెయిన్ దేశం లో దాదాపుగా 70 శాతం కి పైగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే ఇపుడు రష్యా ఆ విద్యుత్ కేంద్రాన్ని అదుపులోకి తీసుకోవడం తో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా విద్యుత్ ని నిలిపి వేస్తే ఇది కనుక వర్కింగ్ లో లేకపోతే అందులో యూ న్నా రియాక్టర్లు వలన భారీ పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. మన దేశం లోనూ లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలను మూసి వేయడం వలన మెషినరీ వర్కింగ్ లో లేక పలు చోట్ల పేలుళ్లు, గ్యాస్ లీకేజీ లు జరిగి భారీ నష్టాలు సంభవించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రం లో సరఫరా నిలిపివేసే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని దానివలన చుట్టుపక్కల దేశాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ రోజు పొద్దున్న ఈ పవర్ ప్లాన్ నుండి మంటలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరి ఈ అణు విద్యుత్ ప్లాంట్ కనుక విస్ఫోటనం చెందితే భారీ నష్టం జరుగుతుందని అంటున్నారు.