యుద్ధంలోకి రష్యా కు వణుకు పుట్టించే నాటో కూటమి ?

frame యుద్ధంలోకి రష్యా కు వణుకు పుట్టించే నాటో కూటమి ?

VAMSI
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్యన గత మూడు రోజుల నుండి జరుగుతున్న యుద్దమే కారణం. ప్రపంచం మొత్తం తమ దృష్టిని ఉక్రెయిన్ దేశంపై కేంద్రీకరించింది. ఏ క్షణం ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్ నడి బొడ్డులో ఒక్కో నగరం పై దాడిని కొనసాగిస్తూ వెళుతున్నారు. ఈ ఉదయమే ఐరాస లో పెట్టిన వ్యతిరేక తీర్మానం కూడా రష్యా వీటో అధికారం ఉపయోగించడంతో వీగిపోయింది. ఈ పరిస్థితిలో రష్యా ఎవ్వరు ఏమి చెప్పినా వినే పరిస్థితిలో లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక నియంతలా మారి విద్వాంసం సృష్టిస్తున్నాడు.

కాగా ఇప్పుడు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేసే దేశాల సంఖ్య పెరుగుతూ ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల నుండి మద్దతు వస్తోంది. అందులో భాగంగా నెదర్లాండ్ దేశం 200 యాంటీ క్రాఫ్ట్ మిస్సైల్స్ ను ఉక్రెయిన్ కు పంపడానికి నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా ఇంతటి దారుణమైన పరిస్థితులలో ఉక్రెయిన్ కు మంచి వార్త అని చెప్పాలి. అంతే కాకుండా పెద్ద దేశాలు అయిన అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బెల్జియం లాంటి దేశాలు కూడా ఉక్రెయిన్ కు అవసరం అయిన ఆయుధ సామగ్రి పంపడానికి అంగీకరించాయని  అంతర్జాతీయ మీడియా ఛానెల్ తెలిపింది. ఈ విషయం కనుక వాస్తవం అయితే ఇక నాతో కూటమి అంతా రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో వచ్చినట్లే.

ఇక రష్యాకు కౌంట్ డౌన్ మొదలవడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. రానున్న కొన్ని గంటలు ఈ యుద్ధం చాలా కీలకం కానుంది. ఇప్పటికి అయినా రష్యా వెనక్కు తగ్గుతుందా లేదా నాటో కూటమి చేతిలో దారుణ ఓటమై చవిచూస్తుందా అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: