మంత్రి పేర్ని నాని: పవన్ కళ్యాణ్ చెప్పేవి శ్రీరంగ నీతులు...?

VAMSI
భీమ్లా నాయక్ సినిమా ఈ రోజు ఎంతో ఘనంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే మొదటి నుండి ఏపీలో టికెట్ల ధరల విషయంలో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రభుత్వ వ్యతిరేకులు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు అని ప్రచారాలు చేశారు. అయితే అంతే కాకుండా ఒక్క భీమ్లా నాయక్ సినిమాను విడుదల కాకుండా ఆపాలని పన్నాగాలు పన్నారని కూడా ప్రచారం జరిగింది. అలా వివాదాల నడుమ ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయింది. దీనితో సినిమా హిట్ అయింది అని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సినిమా రిలీజ్ ను ఆపలేకపోయారని కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఇదే విషయమై నారా లోకేష్ సైతం కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వ్యవస్థలు ఇలా తగల బడ్డాయి అంటే దానికి ప్రథమ కారణం చంద్రబాబే... అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుమ్మెత్తి పోశారు నాని. టీడీపీ నాయకులు మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ సినిమాను జగన్ ప్రభుత్వం అణగదొక్కాల్సిన అవసరం ఏముంది అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు పవన్ గురించి మాట్లాడిన మాటల్లో ఒక్క మాటైనా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారా అంటూ నాని నిలదీశారు.

ఇప్పుడు కొత్తగా ఏపీ థియేటర్ టికెట్ల ధరల గురించి ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం సినిమా టికెట్ ల ధరలు నిర్ణయించింది. అలాగే కొనసాగనివ్వాలి కానీ మధ్యలో అడ్డు పుల్లలు వేయడం ఏమి పద్దతి అంటూ వారిపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ గురించి నాని మాట్లాడుతూ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఎన్నికల్లో ఉన్నాడు. మేము ఎప్పుడూ అతని గురించి ఆలోచించింది లేదు... ఇక ముందు కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుందని అనుకోవడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ ను తీసిపారేశారు. పవన్ కు చట్టాన్ని గౌరవించే మనసు అయితే లేదని తేల్చి చెప్పేశారు. ఆయన కేవలం పెద్ద పెద్ద బహిరంగ మీటింగ్ లు పెట్టి శ్రీరంగ నీతులు చెప్పడానికి మాత్రమే... అంటూ తన స్టైల్ లో జలక్ ఇచ్చారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: