టీడీపీ +ఎర్ర పార్టీలు + ఆ మీడియా= దుష్ప్రచారం?
అంగన్‌వాడీల కోసం, ఆశావర్కర్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చూడండంటూ కొన్ని వివరాలు ప్రజల ముందు ఉంచారు. ఆశా వర్కర్లకు టీడీపీ హయాంలో కేవలం రూ.3 వేలు మాత్రమే జీతం ఇచ్చారని.. ఎన్నికలకు 5 నెలల ముందు వరకూ చంద్రబాబు ఇదే జీతం ఇచ్చారని మంత్రి వనిత గుర్తు చేశారు. ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని వైసీపీ భరోసా ఇచ్చాక అప్పుడు ఓట్ల కోసం ఎన్నికలకు 5 నెలల ముందు చంద్రబాబు ఆశాల జీతాన్ని రూ.6 వేలు చేశారని.. అదే జగన్.. అధికారం చేపట్టిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఆశాల జీతాలను రూ.10 వేలకు పెంచారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గుర్తు చేశారు.
అంగన్‌వాడీ వర్కర్లకు చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందుకు వరకూ కేవలం రూ.7 వేలు మాత్రమే ఇచ్చారని.. దాన్నివైసీపీ ప్రభుత్వం రాగానే రూ.11,500కు పెంచిన మాట వాస్తవం కాదా అని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. 2013 నుంచి అంగన్‌వాడీలకు ప్రమోషన్లు ఇవ్వకపోయినా చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పట్టించుకోలేదన్నారు. అంతే కాదు.. అప్పట్లో ఈ జాతి మీడియా దాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తమను పట్టించుకోలేదన్న విషయాన్ని ఆ మహిళలు నిలదీస్తే ఎప్పుడైనా ఈ జాతి మీడియా ప్రసారం చేసిందా అన్ని ప్రశ్నించారు మంత్రి వనిత. అంగన్‌వాడీ హెల్పర్లకు సైతం జగన్ ప్రభుత్వం జీతాలు పెంచిందని మంత్రి గుర్తు చేశారు. వీరికి ఆరు నెలల ముందు వరకూ ఉన్న జీతం రూ.4500 మాత్రమేనని.. దాన్ని జగన్ ప్రభుత్వం రూ.7వేలకు పెంచలేదా అని ప్రశ్నించారు.