వాహనదారులు అలర్ట్.. అలా చేస్తే జేబుకు చిల్లే?

praveen
ఒకప్పుడు వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినప్పటికి ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు అని వ్యవహరించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేస్తూ ఉండడంతో ఇక టు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత జరిమానాల నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేక పోతున్నారు. అదే సమయంలో  జరిమానాలు కూడా భారీగా పెంచడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతున్నాయ్ అని చెప్పాలి. దీంతో ఎంతో మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలి అంటేనే భయపడిపోతున్నారు

 ఇకపోతే ఇటీవల ఏపీ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇకపై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధించ బోతున్నారు. ఇక అర్హత లేనివారికి డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తే 5వేల జరిమానా జరిమానా విధించబడుతుంది.

 ఇలా అన్ని రకాల జరిమానాలను కూడా  ఏపీ ప్రభుత్వం భారీగా పెంచుతూ వాహనదారులు అందరికీ కూడా షాక్ ఇచ్చింది. ఇక కొత్త రూల్స్ నేపథ్యంలో అటు వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించారు అంటే అటు జేబుకు చిల్లు పడటం ఖాయం అని తెలుస్తోంది. అయితే గతంలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. 2020 అక్టోబర్ 21న దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడకూడదని మినహాయింపునిస్తూ వచ్చింది.

 ఇక ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక కొత్త రూల్స్ ని అమలులోకి తీసుకు వస్తున్నామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అయితే అమలు లోకి వచ్చిన కొత్త రూల్స్ తో ప్రస్తుతం వాహనదారులు అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. అయితే గతంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఎంతోకొంత పోలీసులకు చెల్లిస్తే వదిలేసేవారు అన్న భావన వాహనదారులలో ఉండేది. కానీ ఇటీవల కాలంలో కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్వేర్ లో నమోదు చేసిన మేరకే జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు. దీంతో ఇక ఎక్కడ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ కొత్త రూల్స్ వల్ల వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించేలా చేసి.. ప్రమాదాల సంఖ్య తగ్గించాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: