షాకింగ్ : ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్?
ఈ విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితి అధికారికంగా తెలిపింది. అయితే ఇలా కిడ్నాప్ కు గురైన సిబ్బందిని విడుదల చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయాన్నది ప్రస్తుతం విశ్వసనీయవర్గాల సమాచారం. అభ్యాస్ గవర్నమెంట్ లోని ఐదు మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసినట్లు ఐరాస ఉన్నతాధికారి ప్రతినిధి రసెల్ జీకి చెప్పడం గమనార్హం. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల తర్వాత ఐక్యరాజ్యసమితి సిబ్బందిని వదిలేస్తారా లేదా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
కాగా ప్రస్తుతం సౌదీ అరేబియా నేతృత్వంలో ఉన్న సైన్యం 2015 నుంచి యేమెన్ లో ఉన్నా హౌతిలతో పోరాడుతోంది. అయితే 2015లో హౌతిలు రాజధాని సనా నుంచి ప్రభుత్వాన్ని బహిష్కరించిన తర్వాత యేమెన్ అంతర్యుద్ధంలో సంకీర్ణం జోక్యం చేసుకోవడం గమనార్హం. ఈ సంఘర్షణలో ఏకంగా పది వేల మంది ని చంపింది. అంతే కాకుండా లక్షలాది మంది నిరాశ్రయులు కూడా కావడం గమనార్హం. ఇక ఈ ఒక్క ఘటన వల్ల ఊహించని రీతిలో భయంకరమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.అయితే ఏకంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్ వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయంపై మాత్రం ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉండటం గమనార్హం. హౌతి తీవ్రవాదులే ఈ పని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి