"హిజాబ్ వివాదం" విచారణపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం... ?
కర్ణాటక హైకోర్టు నుండి ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం వస్తే తప్ప కేసు విచారణ ప్రారంభించబోయేది లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి కర్ణాటకలో కళాశాలలు తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని ఆంక్షలను కూడా సూచించారు. హిజాబ్ వివాదానికి అంతిమ నిర్ణయం వచ్చే వరకు కాలేజీల్లో ఎవరూ కూడా మతపరమైన దుస్తులు ధరించకూడదు అని మతాలను ఉద్దేశించేలా చర్యలు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. కాగా, కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టగా ఈ విధంగా స్పందిస్తూ ఆదేశాలను జారి చేసింది. ఏ కళాశాలలో అయినా ఇదే విషయంపై ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నిటినీ గమనిస్తూ శాంతి యుతంగా వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు.
హిజాబ్ అంటే తెర అని అర్దం. హిజాబ్ అనగా ఇక్కడ జుట్టును పూర్తిగా కనపడకుండా కప్పి ఉంచటం. హిజాబ్‌లో మహిళలు తమ జుట్టును ఏ మాత్రం కనిపించకుండా కప్పి ఉంచుతారు. అదే విధంగా మహిళలు తమ తల, మెడను ఏదైనా క్లాత్‌తో కప్పి ఉంచుతూ ముఖాన్ని మాత్రం కనిపించేలా ఉంచుతారు. అయితే ఇది ఎప్పటికి సమసి పోతుంది అనేది తెలియాల్సి ఉంది. కాగా దీనికి మతపరమైన రంగులు పూస్తూ రాజకీయంగా వాడుకోవాడానికి చూస్తున్నారు.