నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలని.. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తానని పేర్కొన్నారు సిఎం జగన్. ఇవాళ టాలీవుడ్ స్టార్లతో సిఎం జగన్ సమావేశం నిర్వహించారు. అనంతరం సిఎం జగన్ మాట్లాడారు. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండి.. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు సిఎం జగన్. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోందని పేర్కొన్నారు సిఎం జగన్. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ అని.. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ అని చెప్పారు సిఎం జగన్. వాతావరణం కూడా బాగుంటుందని.. అందరికీ స్ధలాలు ఇస్తామని వెళ్లయించారు సిఎం జగన్. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామని.. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామన్నారు సిఎం జగన్. విశాఖ బిగ్గెస్ట్‌సిటీ అని.. కాస్త పుష్ చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం అని చెప్పారు సిఎం జగన్. '
చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదని.. మనం ఓన్ చేసుకోవాలని వెల్లడించారు సిఎం జగన్. మనందరం అక్కడకి వెళ్లాలని.. అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుందన్నారు సిఎం జగన్. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలని.. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు సిఎం జగన్. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలలగ.. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలన్నారు సిఎం జగన్. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నానన్నారు సిఎం జగన్. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు అన్నారు సిఎం జగన్.