మొద‌లూ చివ‌రా ఒక్క‌టే స‌ర్! మిస్ యూ ల‌తాజీ

RATNA KISHORE
మొద‌లూ,చివ‌రా అన్న‌వి ఎప్పుడో నిర్ణ‌యం అయి ఉంటాయి.ఆస్ప‌త్రి గోడ‌లు లేదా జీవిత‌పు ఆట స్థ‌లాలు ఇవ‌న్నీ కూడా ఎప్పుడో నిర్ణ‌యం అయి ఉంటాయి. ఎంత కాలం ఓ మ‌నిషి త‌న ఖ్యాతిని  నిలుపుకోవాలి ఎంత దూరం ప్ర‌యాణించి, శ్ర‌మించి మ‌నిషి త‌న కీర్తిని చిరాయువుగా మార్చుకోవాలి అన్న‌వి కూడా దేవ‌దేవుని సంక‌ల్పాలు. కీర్తిని భ‌రించ‌డం చాలామందికి ఇష్టం గా ఉండ‌దు. కీర్తి కార‌ణంగా వ‌చ్చే యుద్ధాలు అపార్థాలు మోయ‌డం క‌ష్టం.
ల‌తాజీ మోయ‌లేనంత భారాన్ని బ‌తికి ఉన్నన్ని రోజులూ మోసే ఉంటారు. ప్ర‌తిభా సంప‌న్న‌త కార‌ణంగా ఇత‌రుల అసూయ‌కు కార‌ణం అయ్యే ఇటువంటి మాతృమూర్తులు మ‌ళ్లీ మ‌ళ్లీ మ‌న మ‌ధ్య‌నే ఉండాలి.అసూయ తొల‌గి పోతుంది.గానం సంబంధిత ఆరాధ్య భావం కూడా ఎన్న‌టికీ వెన్నే ఉంటాయి. తొల‌గిపోయినవ‌న్నీ చెడ్డ‌వే! క‌నుక ఈర్ష్య‌ను,అసూయ‌ను తొల‌గించుకుని ప్ర‌తిభా సంప‌ద‌పై ప్రేమ పెంచుకోవాలి. ఆమె పాట మ‌రోరూపంలో ఎక్క‌డో ఓ ద‌గ్గ‌ర.. ఆమె స్వ‌రం ఎక్క‌డో  ఓ చోట కొండ కోన‌ల దారుల్లో.. మ‌రోకోయిల పుట్టే వ‌ర‌కూ ఆది మ‌రియు అంతం అన్నీ ఆమెనే!

గాన కోకిల,భార‌త ర‌త్న ల‌తా మంగేష్క‌ర్ ఇవాళ తుది శ్వాస విడిచారు.క‌రోనా కార‌ణంగా ఆమె గ‌త కొద్ది రోజులుగా ఆస్ప‌త్రిలోనే ఉన్నారు.మొదట స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తోనే బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చేరిన చివ‌రికి ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో ప్రాణాలు విడిచి యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచెత్తారు.ఆమె ఎన్నో క‌ష్టాలు దాటి, ఎన్నో అవ‌రోధాలు దాటి గొప్ప స్థాయికి చేరుకున్నారు అని
చెప్ప‌డంలో జీవితంపై ఆమె ఉంచిన విశ్వాసం మాత్రమే నిరూప‌ణ‌లో ఉంటుంది. ఆశ్చ‌ర్య క‌రం మొద‌టి పాట ఇప్ప‌టిదాకా విడుద‌ల కాలేదు. మ‌రాఠీ చిత్రంలోఆమె పాడిన పాట ఇప్ప‌టిదాకా విడుద‌ల కాలేదు. కానీ ఆ త‌రువాత ఆమె గాయ‌నిగా రాణించారు. గొప్ప పేరు ఖ్యాతి అన్న‌వి ద‌క్కించుకుని చ‌రిత్ర‌లోనే నిలిచిపోయారు.
ల‌తాజీ సోద‌రి ఆశా భోంస్లే కూడా చాలా మంచి గాయ‌ని. వాళ్ల‌ది సంగీత కుటుంబం. నాన్న కూడా సంగీత కారులే.ఆయన పేరు దీనా నాథ్ మంగేష్క‌ర్. లతాజీ పాడిన పాట‌లు విని, నేర్చుకుని గొప్ప గొప్ప గాయ‌కులుగా రాణించిన వారు ఎంద‌రో! భార‌తీయ భాషల‌కు సమున్నత గౌర‌వం ఆమె గాత్రంతోనే ద‌క్కింది.ఆమె పాట‌తోనే ఆ ఔన్న‌త్యం మ‌రింత విస్తృతం అయింది.ఆమెను స‌ర‌స్వ‌తి దేవితో పోలుస్తున్నారు కేసీఆర్.ఆమె భార‌తీయ సంగీతానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడుతున్నారు కేసీఆర్.ఆయ‌నొక్క‌రే కాదు యావ‌త్  భార‌త దేశం ఆమె పాడిన భ‌క్తి పాట‌లు, దేశ భ‌క్తి గీతాలు అన్నీఅన్నీ మ‌రోసారి తలుచుకుని ప్ర‌తిభా సంప‌న్న మూర్తికి వంద‌నాలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: