ఏపీలో విద్యుత్ కష్టాలు మటు మాయం... త్వరలోనే?

frame ఏపీలో విద్యుత్ కష్టాలు మటు మాయం... త్వరలోనే?

VAMSI
ఏపీలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కష్టాల కడలిలో ఉంది అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఒకవైపు ప్రతి పక్ష పార్టీల నుండి అభివృద్ధి మరియు నవ రత్నాల గురించి విమర్శలు ఎదుర్కొంటుంటే, మరో వైపు ప్రభుత్వం ఉద్యోగుల నుండి పీఆర్సీ అమలు కోసం తమ బాధ్యతలు అన్నిటినీ విస్మరించి రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం చర్చలకు రమ్మని పిలుస్తున్నా ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. ఫిబ్రవరి 7 నుండి సమ్మె ను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు సమస్యలు జగన్ ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ప్రజల బాగు కోసం ఒక శుభవార్తను తెలిపింది.

గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కష్టాలు ఏ విధంగా  ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం కరెంట్ వినియోగం ఎక్కువ కావడం మరియు కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడమే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం నుండి ఎంపి విజయ సాయి రెడ్డి ఒక ప్రకటన చేశాడు. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్ లను నిర్మించడానికి ప్రణాళిక ను సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ లో కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ విజయ్ సాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చినట్లు ప్రకటనలో తెలిపారు.

ఇక్కడ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఒక్కో అణు రియాక్టర్ 1208 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ రియాక్టర్ లు మన దేశంలో తయారు కాకపోయినా బాగా పని చేస్తాయని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రం విద్యుత్ కష్టాల నుండి బయటపడుతుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: