రేవంత్ రెడ్డి: కేసీఆర్... "దేశ ద్రోహి"?
అంతే ఇక ఆ క్షణం నుండి కేసీఆర్ పబ్లిక్ అందరికీ బడా శత్రువు అయ్యాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తెలంగాణలోని ప్రతి పక్ష పార్టీలు అన్నీ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నాయి. ఇన్నేళ్ల గౌరవం శ్రమ పదవి అన్నింటినీ గౌరవించిన వారు ఈ రోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే బీజేపీ కి చెందిన బండి స్నాజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ లాంటి పలువురు నాయకులూ కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, అయితే తాజగా నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు బనాయించాలని డిమాండ్ చేశారు.
రేపటి నుండి ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులూ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం లోని చట్టాల వలనే కేసీఆర్ రెండు సార్లు ప్రత్యేక తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడని గుర్తు చేశారు. మరి ముందు ముందు ఈ వివాదం ఇంకెంతదూరం వెళ్లునుందో తెలియాల్సి ఉంది.