కృపారాణి : ధీర వనితకు రాజయోగం! భళా జగన్!
సత్తా చాటుకున్న ధీర : 2009లో టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడుతో సహా బరిలో నిలిచి,80 వేల ఓట్లకు పై చీలుకు ఓట్ల తేడాతో ఓడించిన వైనం ఎన్నటికీ ఓ చిరస్మణీయం.ఎంపీగా ఎన్నికయిన తొలి సారే కేంద్ర టెలికాం,కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పదవి అలంకరించిన సందర్భం ఆమె రాజకీయ జీవితానికో మెచ్చుతునక.అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పుడు దివంగత నేత ఎర్రన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో సర్పంచ్ ను నిలబెట్టి తన మాటను నెగ్గించుకుని,టీడీపీ ఆశలను గల్లంతు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఆ విధంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
ఈ నేపథ్యంలో...పెద్దల సభకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు త్వరలోనే వెలువడనున్నాయి.ముందు నుంచి పార్టీలో ఉంటూ, పార్టీని నడిపించే రీతిలో సమర్థతను నిరూపించుకున్న వారికి ఈ సారి అవకాశాలు వరించనున్నాయి.ఈ క్రమంలో మహిళా ప్రాధాన్యం కూడా ఉండనుంది.ఉత్తరాంధ్ర నుంచి మహిళా నాయకత్వాలను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు పదవుల విషయమై వారికే సముచిత స్థానం ఇచ్చారు.అలాంటి ప్రాధాన్యాన్నే పునరావృతం చేస్తూ..శ్రీకాకుళం జిల్లాకు ఓ మంచి గుర్తింపును ఇస్తూ..బీసీ మహిళ కిల్లి కృపారాణికి రాజ్యసభకు పంపనున్నారని నిర్థారితం అయింది.జిల్లాలో ఇప్పటికే జెడ్పీచైర్మన్ పిరియా విజయ ఉన్నారు.ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల తరఫున విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి ప్రాధాన్యం వహిస్తున్నారు.అదేవిధంగా జిల్లాను కొంత ప్రభావితం చేసే అరకు ఎంపీగా గొడ్డేటి మాధవి ఉన్నారు.ఇదే క్రమంలో మరోసారి మహిళలకు సమున్నత స్థానం ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు అధిష్టానం వచ్చింది.జూన్-లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా సాయిరెడ్డి తో పాటు మరో ముగ్గురు ఇదే సమయంలో పెద్దల సభకు వెళ్లనున్నారు.వారిలో కృపారాణితో పాటు కాపు సామాజికవర్గంకు సంబంధించి ఒక నేతను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని వార్తలొస్తున్నాయి. లేదంటే ముద్రగడకు ఓ ఛాన్స్ ఉంటుంది.
వీరితో పాటు ఉత్తరాదికి చెందిన సురేశ్ ప్రభుకు కూడా రాష్ట్రం నుంచి చోటు దక్కనుంది.బీజేపీతో ఉన్నసఖ్యత దృష్ట్యా ఆయన పేరు రానున్న జాబితాలో చేరనుంది.మరోవైపు కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి మాత్రం పూర్తి వాస్తవ దూరం అని కూడా నిర్థారితం అయింది.ఉత్తరాంధ్ర నుంచే శాసన సభ సభ్యురాలిగా ఉన్న రెడ్డి శాంతితో రాజీనామా చేయించి,ఆమెను రాజ్యసభకు పంపుతారని కూడా కొన్ని అవాస్తవ కథనాలు వస్తున్నాయి.అయితే ఇవి పూర్తి నిరాధారితం అని వైసీపీ వర్గాలే కొట్టిపారేస్తున్నాయి.మరోవైపు సాయిరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా పెద్దల సభకు పంపుతారని వార్తలొస్తున్నా,
అవి కూడా పూర్తి అవాస్తవ సంబంధితాలు అని తేలిపోయింది.అన్నీ కుదిరితే కృపారాణికి రాజయోగం ఖాయం.
ఎలా చూసుకున్నా,ఏ విధంగా విశ్లేషించినా వస్తున్న కాలంలో ఉత్తరాంధ్రకు మంచి ప్రాధాన్యం దక్కనుంది అని తేలిపోయింది. స్థిరమయిన నాయకత్వానికి సముచిత స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉంది.ఈ క్రమంలో వచ్చే జూన్-లో తనదైన నిర్ణయంను వెలువరించి,పార్టీ కోసం కష్టపడే వారికీ,పార్టీని ముందుకు నడిపేవారికీ సముచిత రీతిలో గౌరవం ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచిస్తుంది.ఈ ఆలోచనలకు,ప్రతిపాదనలకు అనుగుణంగా పెద్దల సభలో శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణికి చోటు దక్కనుంది.బీసీ మహిళ ఖాతాలో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టం అయిన హామీ ఒకటి అందిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకే కాదు ఉత్తరాంధ్రలో ఉన్న మహిళా నాయకత్వానికీ, సమర్థ రీతికీ ఆమెకు వరించనున్న పదవి ఓ సుస్పష్ట సంకేతం కానుంది.ఆల్ ద బెస్ట్ మేడమ్..