ఉపాధ్యాయుల సమస్యలపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran
ఉపాధ్యాయుల సమస్యలపై రేవంత్ రెడ్డి  సంచలన నిర్ణయం ?
రేపటి టీచర్ల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ  మద్దతు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు   టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   రేపు (29/01/2022) నాడు రాష్ట్రం లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్వర్యంలో 317 జీఓ రద్దు కోరుతూ జరిగే ధర్నా కు  కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి కార్యకర్త పాల్గొని ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి మద్దతు పలకాలన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..  అదే విధంగా సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన ప్రస్తుతం తమ స్థానికతకే ముప్పు ఏర్పడిన 317 జీఓ రద్దు కై నిరంతరం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. 

పోరాటం చేయడం తో పాటు ఉపాధ్యాయ సంఘాలు చేసే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.  ఉపాధ్యాయులు ఎవరు ఆధైర్య పడొద్దని, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేయడానికి ముందు ఉండటమే కాకుండా, ఉద్యోగులకు కూడా అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నానని వెల్లడించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.  తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు తెలపడమే కాకుండా.. అన్నీ ముందు ఉంది చూసుకుంటుందని ప్రకటన చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. . ఈ వీసహస్యం ఎక్కడి దాకా అయినా వెళ్ళి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   ఈ మెరకు ఓ ప్రకటనను విడుదల చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: