పంజాబీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం !
పంజాబీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా సిఎమ్ అభ్యర్ధి పేరును ప్రకటిస్తుందన్నారు రాహుల్ గాంధీ. అయుతే, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, పంజాబ్ ప్రజలు కోరుకుంటేనే ముందస్తు ప్రకటన చేస్తామన్న రాహుల్ గాంధీ... ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది నిర్ణయంచుకోవాల్సిందిగా పార్టీ కార్యకర్తలను కోరతామన్నారు. సిఎమ్ చరణ్ జిత్ సింగ్, పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిధ్దు ల మధ్య కొనసాగుతున్న వైరం నేపధ్యంలో రాహుల్ గాంధీ వ్సాఖ్యలకు ప్రాధాన్యత ఉంటుందని.. ఇద్దరు నాయకత్వం వహించలేరు. కేవలం ఒక్కరే అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఒకరు నాయకత్వం వహిస్తే, మరొకరు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరి హృదయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉందని.. ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడబోమని ఇద్దరు నేతలు కూడా బాహాటంగా ప్రజలకు హామీ ఇస్తారన్నారు.