కమ్యూనిస్టులు కలిస్తే ఆ సీటు టీడీపీదే?

M N Amaleswara rao
ఏపీలో కమ్యూనిస్టుల పాత్ర పరిమితమే అని సంగతి తెలిసిందే..ఒకప్పుడు అంటే కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు...ఇప్పుడు ఉన్నారా? లేరా? అన్నట్లు ఉన్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో వారికి బలం లేకుండా పోయింది. గతంలో పలు సీట్లలో కమ్యూనిస్టులకు ఎక్కువ బలం ఉండేది. వారికి సొంతంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుచుకునే బలం ఉండేది. అలాగే టీడీపీతో గాని, కాంగ్రెస్‌తో గాని పొత్తు పెట్టుకుని వారు పలు సీట్లలో సత్తా చాటేవారు. కానీ నిదానంగా కమ్యూనిస్టుల బలం తగ్గిపోవడంతో వారితో ఎవరు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం లేదు.
గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పవన్ పొత్తు పెట్టుకుని పోటీ చేశారు..కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కమ్యూనిస్టులు ఒక సీటు గెలుచుకోలేదు..అలాగే డిపాజిట్లు కూడా కోల్పోయారు. అలా అని కమ్యూనిస్టుల వల్ల జనసేనకు ఒరిగింది కూడా ఏమి లేదు. అంటే కమ్యూనిస్టుల బలం చాలావరకు తగ్గిపోయిందని అర్ధమవుతుంది. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు ఇంకా బలం కనిపిస్తోంది. అంటే ఆ పార్టీకి గెలిచే అంత బలం లేదు గాని, గెలుపోటములని మాత్రం ప్రభావితం చేసే బలం ఉందని చెప్పొచ్చు.
అలా కమ్యూనిస్టులు కాస్త ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో రంపచోడవరం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు కాస్త బలం ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే గెలిచింది. కానీ ఈ సారి వైసీపీకి అవకాశం వచ్చేలా లేదు. ఇప్పటికే ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇటు టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వస్తుంది.
అయితే టీడీపీకి ఇక్కడ సింగిల్‌గా వైసీపీని ఓడించే సత్తా లేదు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే ఈ సీటు లాగేయొచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ కమ్యూనిస్టులకు 18 వేల ఓట్ల వరకు పడ్డాయి. అందులో జనసేన ఓట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆ పార్టీతో పొత్తు ఉంది. అంటే జనసేన, కమ్యూనిస్టులని కలుపుకుంటే రంపచోడవరంలో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: