చెన్నకేశవరెడ్డి అయిదోసారి రెడీ..!

M N Amaleswara rao
చెన్నకేశవరెడ్డి...ఇదేదో సినిమా పేరు కాదు..ఒక వైసీపీ ఎమ్మెల్యే పేరు. అయితే ఈ పేరుని తక్కువ సందర్భాల్లోనే విని ఉంటాం..ఎందుకంటే ఈయన కర్నూలు జిల్లా రాజకీయాలకే పరిమితం. పైగా రాష్ట్ర స్థాయిలో ఈయన దూకుడుగా రాజకీయం చేయడం, ప్రతిపక్షాలపై ఎడాపెడా విమర్శలు చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం లాంటివి చేయరు. అందుకే ఈయన పేరు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎక్కువ వినిపించదు. కానీ కర్నూలు ఎమ్మిగనూరు పేరు చెబితే..చెన్నకేశవరెడ్డి పేరు ఖచ్చితంగా గుర్తొస్తుంది. అంతలా ఎమ్మిగనూరు రాజకీయాలపై ఆయన గ్రిప్ తెచ్చుకున్నారు.
వాస్తవానికి ఎమ్మిగనూరు టీడీపీ కంచుకోట...1985 నుంచి 1999 వరకు అక్కడ టీడీపీకి తిరుగులేదు. అలాంటి టీడీపీ కంచుకోటలో సత్తా చాటిన నేత చెన్నకేశవరెడ్డి...2004లో కాంగ్రెస్ నుంచి  గెలిచి టీడీపీ విజయాలకు బ్రేక్ వేశారు. ఆ వెంటనే 2009లో కూడా టీడీపీని మట్టికరిపించారు. ఇక వైఎస్సార్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే చెన్నకేశవరెడ్డి...కాంగ్రెస్‌ని వదిలేసి, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు...వైసీపీలో చేరి 2012 ఉపఎన్నికలో మరోసారి ఎమ్మిగనూరు బరిలో నిలబడి గెలిచారు.


అయితే 2014 ఎన్నికల్లో మాత్రం కాస్త పరిస్తితి తారుమారైంది....ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డిపై టీడీపీ నేత జయనాగేశ్వర్ రెడ్డి గెలిచారు. ఈయన మోహన్ రెడ్డి తనయుడు..ఇక మోహన్ రెడ్డి 1985 నుంచి 1999 ఎన్నికల వరకు టీడీపీలో సత్తా చాటిన నేత. ఆయన వారసుడుగా వచ్చిన జయనాగేశ్వర్ 2014లో గెలిచారు. పైగా టీడీపీ అధికారంలో ఉండటంతో ఐదేళ్ల పాటు బాగానే పనిచేశారు.
కానీ చెన్నకేశవరెడ్డి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసి..2019 ఎన్నికల్లో జయనాగేశ్వర్ రెడ్డికి చెక్ పెట్టేశారు. దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గవ సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ప్రస్తుతానికి ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి బలం ఏ మాత్రం తగ్గలేదు..పైగా ఆయనపై నెగిటివ్ కూడా పెద్దగా లేదు. ఎమ్మిగనూరులో మెజారిటీ ప్రజలు చెన్నకేశవరెడ్డిపై ఉన్నట్లు కనిపిస్తున్నారు...ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా చెన్నకేశవరెడ్డి ఐదోసారి కూడా సత్తా చాటేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: