వాల్తేరు వార్త : టీడీపీలో ఆపరేషన్ స్వగృహ ఎక్కడంటే?
వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు మంచి పట్టున్ననేతలు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు.ఆ క్రమంలోనే అభ్యర్థుల గురించి ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు.ఎక్కడా ఈక్వేషన్లు చెడిపోకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేసే క్యాడర్ కోసం లీడర్ కోసం అప్పుడే వెతుకులాటలు అవుతున్నాయి.పక్క పార్టీలకు వెళ్లిన వారు ఇటుగా వచ్చినా రానివ్వద్దని అధినేతకు చాలా మంది చెబుతున్నారు.కొందరైతే హెచ్చరికలు జారీచేస్తున్నారు.విశాఖలో విభిన్న వాతావరణం ఉంది.మొన్నటి వేళ వైసీపీకి వెళ్లిపోయిన దక్షిణ నియోజకవర్గ నేత,ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ మళ్లీ ఇటుగా వస్తున్నారు. మరి! ఆయన రాకను ఎందుకని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి జీవీఎంసీ ఎన్నికల ముందు వైసీపీలో చేరి, జగన్ ఆశీస్సులు అందుకున్నారు.కుమారులు కూడా ఇటుగానే వచ్చారు.అయినప్పటికీ మునుపటి హవా అయితే కొనసాగించలేకపోతున్నారు.వైసీపీలో ఆయననను పెద్దగా పట్టించుకునే వారే లేరని కూడా తెలుస్తోంది.జీవీఎంసీలో కూడా ఆయన మాట నెగ్గడం లేదని ఓ ప్రధాన మీడియా చెబుతోంది. సాయిరెడ్డి కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారని అందుకనే ఆయన టీడీపీకి గూటికి తిరిగి చేరుకోనున్నారని తెలుస్తోంది.కానీ పసుపు పార్టీలో ఆయన రాకను అడ్డుకోవడమే కాకుండా వచ్చినా ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వకూడదని పట్టుబడుతున్నా రు.అధినాయకుడు కూడా ఇదే విషయాన్ని పరిగణిస్తున్నారని తెలుస్తోంది.టీడీపీలో ఉంటూ రాజకీయం చేసుకున్నా బాగుండేది అన్న ఓ తుది ఆలోచనకు వాసుపల్లి వచ్చినా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సాధించేది నిండు సున్నా.