టీఆర్‌ఎస్‌ కు షాక్‌..బండి సంజయ్‌ కొత్త స్కేచ్‌ ఇదే ?

Veldandi Saikiran
బీజేపీ ఎస్సీ నియోజక వర్గాల సమన్వయ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. అయితే.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకమన్నారు బండి సంజయ్‌.  ఎస్పీ నియోజకవర్గాల్లోని ఇతర కులాలను పార్టీ వైపు మళ్లించాలని పిలుపు నిచ్చారు బండి సంజయ్‌.  అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం చూస్తుందని వెల్లడించారు బండి సంజయ్‌. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్వే నిర్వహిస్తున్నాయని చెప్పారు బండి సంజయ్‌. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం క్రమేణ పెరుగుతోందని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు   బండి సంజయ్‌. 

ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఒకరోజు పూర్తిగా పర్యటించాలని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.  అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14) న ఎస్సీ నియోజక వర్గాల్లో ‘ బహుజన పాదయాత్ర’ పేరిట  కనీసం 2 నె లలపాటు పాదయాత్ర చేసేలా కార్యక్రమాన్ని రూపొందించాల స్పష్టం చేశారు బండి సంజయ్‌.  నియోజకవర్గంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వివరాలను గ్రామాల వారీగా సేకరించి  ప్రచారం చేయాలని వెల్లడించారు బండి సంజయ్‌.  డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు పథకాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ఈ సమన్వయ కమిటీ క్రుషి చేయాలని స్పస్టం  చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.  కేసీఆర్‌ సర్కార్‌ కు వ్యతిరేకంగా...  గ్రామ స్థాయి లో ప్రచారం. పోరాటాలు కొనసాగించాలని పిలుపు నిచ్చారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్‌ కుమార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: