ఓరి నాయనో.. కండక్టర్ కి కరోనా.. అందరిలో ఆందోళన?
ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమం అని అనుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. కానీ అదే ఇప్పుడు కొత్త భయానికి దారితీసింది. ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా పని చేస్తున్న ఓ మహిళ కరోనా వైరస్ బారిన పడింది.దీంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ కండక్టర్ అప్పటివరకు ఎంతో మందికి తన చేతులతోనే టికెట్ అందించడం ప్రయాణికులకు చిల్లర ఇవ్వడం లాంటివి చేసింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు లో వెలుగులోకి వచ్చింది.. చెన్నూరు లోని ఓ మహిళా కండక్టర్ కరోనా వైరస్ సోకడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారిపోయింది..
హన్మకొండ చెన్నూరు ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తుంది ఓ మహిళ. ఇటీవలే ఎప్పటిలాగానే విధులకు హాజరు అయింది. ఇక ఆమెకు ఎక్కడా వైరస్ లక్షణాలు కూడా లేవు. ఎంతో ఆరోగ్యంగా ఉంది. కానీ ఇటీవలే బస్సు దిగిన తర్వాత బస్సు డ్రైవర్ తో కలిసి టీ తాగింది ఆ మహిళ కండక్టర్. ఈ క్రమంలోనే సరదాగా దగ్గరలో ఉన్న ఓ కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా వైరస్ టెస్ట్ చేయించుకుంది.. ఇక ఈ పరీక్షలో షాకింగ్ నిజం బయటపడింది. సదరు మహిళ వైరస్ బారిన పడిందన్న విషయం తేలింది. దీంతో ఇక ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు .