ఆ కోడి ఖరీధు బంగారం కంటే ఎక్కువ?

Satvika
సంక్రాంతి పండుగ వస్తుంది అంటే కోడి పందాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ఒకవైపు పంధాలు జరుగుంటే మరోవైపు కోడికి డిమాండ్ కుడా అమాంతం పెరిగిపోతాయి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పందాలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి పందాలు మాంచి జోరు మీద ఉన్నాయి.. గత రెండేళ్ళు పందాలు పూర్తిగా కరొన వల్ల ఆగి పోయినట్లు తెలిసిందే. ఇప్పుడు కూడా ఇటువంటి నిబంధనలు అమల్లొ ఉన్నా పందెం రాయుల్లు వెనకడుగు వేయలేదు. ఈరోజు సాయంత్రం వరకూ పోలీసులను మర్చిపోయి ఎంజాయ్ చేసారు.

తూర్పు గోదావరి లో ఇవి కాస్త ఎక్కువగా జరిగినట్లు ప్రత్యేకంగా చెప్పవలసి న అవసరం లేదు. ఈ పండగ అంటే కోడి పుంజుల కోట్లాటలు ఊపందుకున్నాయి. పోలీసుల ముందు కోడి పందాల రాయుళ్లె గెలిచినట్లు అయింది. ఒక పక్క జూదాలు మరో పక్క కోడి పందాలు నడుస్తుంటే, పందెం లో ఓడి పోయిన కోళ్ల కు గిరాకి కూడా ఎక్కువే.. పందెం కోసం బాగా పెంచిన కోడి కావడంతో మంచి రుచి కూడా వుంటుంది. అందుకే వీటిని కొనుగోలు చేయడానికి జనాలు ఎగబడుతున్నారు.

2000 నుండి 5000 వరకు డిమాండ్ ఉంది. పందెం అవ్వగానే స్పాట్‌ లో కోస కోసం క్యూ లో ఉంటున్నారు.. కోనసీమ లో వీటికి డిమాండ్ ఎక్కువే. అంతేకాదు వీటిని ఏకంగా రాష్ట్రాలను కూడా దాటిస్తున్నారు. పందాలు జరుగుతున్న సమయం లోనే కోస కోసం మాంసం ప్రియులు వేచి ఉంటున్నారు. పందెం ముగిసిన వెంటనే కోస కావాలంటూ పెందెం గెలిచిన వారి చుట్టూ చేరుతున్నారు. అది మాంసం రుచిగా ఉండటం వల్ల డిమాండ్ కుడా ఎక్కువే అందుకే వీటిని ఎక్కువగా కొంటారు. ఈ కోడిని కొన్న రేటు తో ఒక గ్రాము బంగారం కొనవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: