జగనన్న శఠగోపం.. ఇప్పుడైనా అర్థమైందా..?

Chakravarthi Kalyan
జగన్ సర్కారుపై విమర్శల డోసు పెంచుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఇప్పుడు ఉద్యోగుల సమస్యపైనా ఫోకస్‌ పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అమానుషంగా వ్యవహరించిందన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఇకనైనా ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయం పట్ల అవగాహన తెచ్చుకుని పోరాడాలని పిలుపు ఇచ్చారు. జగనన్న శఠగోపం అంటే ఏంటో ఇప్పుడైనా అర్థమైందా..? అంటూ ఆయన ఉద్యోగులను ఉద్దేశించి కామెంట్ చేశారు.

ఉద్యోగుల పరిస్థితి చూస్తే జాలేస్తుందన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. జగన్నన్న శఠగోపం..  క్షవరం అయితే గాని వివరం రాదు అనేలా ఉంది ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని వాపోయారు. ఇన్ని రోజులు పీఆర్సీ ఎప్పుడు అని ఆడిగినోళ్లు... ఇప్పుడు ఉన్నది కొనసాగితే చాలు అన్న పరిస్థితికి వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నారు. ఉద్యోగస్తులు.. ఇకనైనా  భయపడుతున్న మీ నాయకులను మార్చుకోండి అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిలుపు ఇచ్చారు.

ఉద్యోగస్తులు తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఫీల్ అవ్వకుండా.. మీ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని నాయకులుగా తెచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు. జగన్ విషయంలో ఓటర్లకు రెండేళ్ల తరువాత  క్షవరం అయ్యిందని తెలిసిందని .. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అటు ప్రజలు, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే భయపడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యంలో సరికాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నారు.

ఇక నుంచి అయినా.. ఉద్యోగస్తులు తమ హక్కుల కోసం ఉద్యోగులు పోరాడాలని.. ఉద్యోగస్తుల పోరాటం విజయవంతం కావాలని రఘురామ కృష్ణ రాజు ఆకాంక్షించారు. మొత్తానికి రఘురామ కృష్ణంరాజు.. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ వర్గాన్నీ వదిలిపెట్టడం లేదు. త్వరలో పదవికి రాజీనామా చేస్తానంటున్న రఘురామ కృష్ణంరాజు.. అందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు కూడా సిద్దం  చేసుకుంటున్నారు. మరి ఈ పోరాటంలో ఆయన ఎంత వరకూ విజయం సాధిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: